పాక్ తో ఉద్రిక్తతల వేళ.. ఆ ముస్లిం దేశంతో మోదీ దోస్త్ మేరా దోస్త్..!

పాకిస్థాన్ తో ఉద్రిక్తతల వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లోని రైతాంగానికి మేలు చేసే విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు ముఖ్యమైన ఎరువులను దిగుమతి చేసుకునేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం ఈ ఏడాది 30 లక్షల మెట్రిక్ టన్నుల(LMT) ఎరువులను భారత్ దిగుమతి చేసుకోనుంది.

India Signs Key Agreement with Saudi Arabia for Long-Term Chemical Fertilizer Imports

భారత్ లో వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యధిక పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో టాప్ ప్లేస్ లో ఉంది. పత్తి, గోధుమ, వరి సాగు విస్తీర్ణంలో కూడా భారత్ దూసుకెళ్తోంది. వ్యవసాయ రంగంలో దేశంలోని 50 శాతం కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయంలో ఎరువులు ఎంతో కీలకం. ఈ క్రమంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం దేశమైన సౌదీ అరేబియాతో కీలక ఒప్పందం చేసుకుంది.

ఈ మేరకు భారత్ కు చెందిన ఇండియన్ పొటాష్ లిమిటెడ్, క్రిబ్ కో , కోరమాండల్ సంస్థలు సౌదీ అరేబియాకు చెందిన మా డెన్ కంపెనీతో 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల డై అమ్మోనియమ్ ఫాస్ఫేట్ ఎరువును 2025-26 నుంచి ఏటా ఐదేళ్లాపాటు దిగుమతి చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంది. జులై 11, 13 తేదీల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా బృందం సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంతో సౌదీ అరేబియా- భారత్ మధ్య ఫెర్టిలైజర్స్, కెమికల్స్, ఫార్మా రంగాల్లో అభివృద్ధి సాధిస్తాయని అభిప్రాయపడ్డారు.

భారత్ కు ఎరువుల ఎగుమతిలో సౌదీ అరేబియా ప్రముఖ స్థానంలో ఉంది. 2024-25 లో సౌదీ నుంచి భారత్ 19.05 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ ఎరువులను దిగుమతి చేసుకుంది. ఇది 2023-24 ఏడాదితో పోల్చితే 17 శాతం అధికం కావడం గమనార్హం. తాజాగా ఈ ఏడాది 30 లక్షల మెట్రిక్ టన్నుల(LMT) ఎరువులను భారత్ దిగుమతి చేసుకోనుంది. సౌదీ నుంచి భారత్ దిగుమతులు ఏటేటా పెరుగుతూ వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+