రక్షణ రంగంలో 74% విదేశీకి అనుమతి - ‘ఆత్మరనిర్భర్ భారత్’పై ప్రధాని మోదీ - అంటే తలుపులు మూయడం కాదు
''ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే బయటివాళ్లను లోనికి రానివ్వకుండా మనకు మనం అన్ని తలుపులు మూసేయడం కాదు. ఆత్మనిర్భర్ అసలు ఉద్దేశం.. భారతదేశాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్ది.. ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించే స్థాయిలో నిలబెట్టడం'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ అభియాన్ లో భాగంగా రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలంటే ఏం చేయాలనే టాపిక్ పై నిర్వహించిన వెబినార్ లో గురువారం ఆయన కీలక ప్రసంగం చేశారు.
దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రధాని.. ఆ క్రమంలో కొత్త టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రైవేటు ప్లేయర్లకు కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు. భారత రక్షణ రంగంలో 74 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే సమయంలో భారత రక్షణ పరిశ్రమకు ప్రోత్సాహాన్నిచ్చే లక్ష్యంతో కొన్ని రకాల విదేశీ రక్షణ పరికరాల దిగుమతిపై ఆంక్షలు విధించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.

''రక్షణ ఉత్పత్తులకు సంబంధించి భారత్ చాలా కాలంగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. నిజానికి మనకు స్వాతంత్ర్యం రావడం కంటే ముందు నుంచే(దాదాపు 100 ఏళ్ల నుంచే) ఈ గడ్డపై పలు రకాల రక్షణ పరికరాలు ఉత్పత్తి అయ్యాయి. దురదృష్టవశాత్తూ తొలినాళ్లలో ప్రభుత్వాలు ఆ అంశంపై దృష్టిపెట్టలేదు. దీంతో క్రమంగా మనం దిగుమతులకు అలవాటుపడ్డాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా రాబోయే రోజుల్లో రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తాం'' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూనే, సొంతకాళ్లపైనా భారత్ ఎదుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. కీలకమైన ఈ వెబినార్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తోపాటు త్రివిధ దళాలకు చెందిన ముఖ్య అధికారులు, వివిధ శాఖల సెక్రటరీలూ పాల్గొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications