Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రిటన్ రాణి మరణంతో భారత్ లోనూ విషాదం-ఎల్లుండి జాతీయ సంతాపదినంగా ప్రకటన

బ్రిటన్ ను సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ మరణంతో బ్రిటన్ సహా పలు యూరప్ , ఆసియా దేశాల్లోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించిన ఎలిజబెత్ మృతికి సంతాపంగా బ్రిటన్ లో వారం రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు. ఇదే కోవలో పలు కామన్వెల్త్ దేశాలు కూడా జాతీయ సంతాప దినాల్ని పాటిస్తున్నాయి. దీంతో భారత్ కూడా ఎల్లుండి జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II మరణించిన నేపథ్యంలో సెప్టెంబర్ 11న భారతదేశం అంతటా ఒకరోజు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

India to observe day of state mourning on Sept 11 over Queen Elizabeth’s demise
ఇప్పటికే భారత ప్రధాని నరేంద్రమోడీ, సోనియా, రాహుల్ తో పాటు పలువురు ప్రముఖులు రాణి మృతికి సంతాప సందేశాలు పంపారు. భారత్ తో ఆమెకున్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటున్నారు. గతంలో మూడుసార్లు భారత్ పర్యటించినప్పుడు ఆమె మన ఆతిధ్యాన్ని చూసి ఎంతో ముగ్దులయ్యారు.

మరోవైపు రాణి మృతితో బ్రిటన్ వ్యాప్తంగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. ప్రజలు భారీ ఎత్తున ఆమె మృతదేహం ఉన్న బల్మోరల్ క్యాజిల్ కు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు బ్రిటన్ రాజకుటుంబం అంతా క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల తర్వాత ఏడవ రోజు వరకూ సంతాప కాలాన్ని పాటిస్తారు. రాజ నివాసాల వద్ద జెండాలు సగం మాస్ట్‌లో ఉంటాయి.రాణి అంత్యక్రియల తర్వాత ఏడు రోజుల వరకు రాజకుటుంబ సంతాప దినాలను పాటించాలని ప్రిన్స్ ఛార్లెస్ కోరిక అని బకింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+