తమిళనాడులో క్లీన్ స్వీప్ చేయబోతున్న ఇండియా కూటమి-జాతీయ సర్వే సంచలనం..
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలు గెలవబోతున్నాయో మరో జాతీయ సర్వే వెలువడింది. లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ముందంజలో ఉంది, ఏ పార్టీ వెనుకబడిందన్న ఈ సర్వేలో సంచలన అంశాలున్నాయి. దీని ప్రకారం ఇప్పటివరకూ అనుకుంటున్న లెక్కలన్నీ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన మారుతున్న పరిస్దితులకు ఈ సర్వే అద్దం పట్టింది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఏయే పార్టీలకు ఓటర్లు పట్టంగట్టబోతున్నారనే అంశంపై జాతీయ మీడియా నెట్ వర్క్ ఇండియా టుడే- సీఓటర్ తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా సర్వే చేసింది. ఇందులో తమిళనాడుకు సంబంధించి డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు తేలింది. తమిళనాడులో ఉన్న మొత్తం 39 ఎంపీ సీట్లనూ ఈ కూటమి కైవసం చేసుకుంటుందని సర్వే తేల్చేసింది.

ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 ఎంపీ సీట్లలో అన్ని స్ధానాల్లోనూ డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టులు గెల్చుకోబోతున్నట్లు ఈ సర్వే తేల్చింది. గతంలో 2019 ఎన్నికల్లోనూ ఈ కూటమికి 38 సీట్లు దక్కాయి. ఈసారి మరో సీటు పెంచుకుని ఏకంగా క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ సర్వే ఫలితాలు తేల్చేశాయి.
తమిళనాడులో ఇండియా కూటమికి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 47 శాతం ఓట్లు దక్కబోతున్నట్లు ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో తేలింది. అలాగే బీజేపీ, మిత్రపక్షాలకు కేవలం 15 శాతం ఓట్లు దక్కబోతున్నాయి. కాంగ్రెస్ ఇతరులు 38 శాతం ఓట్లు కైవసం చేసుకుంటారని ఈ సర్వేలో తేలింది. గతేడాది తమిళనాడులో ఘనవిజయంతో అధికారంలోకి వచ్చిన స్టాలిన్ నేతృత్వంలోని ఇండియా కూటమి విజయవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications