ఒంటరి పోరుతో విజయ్ నెగ్గుతాడా ? తమిళ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే..!
దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓటరు ఎలా స్పందిస్తాడన్న దానిపై జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే (india today) ఎప్పటిలాగే సీ-ఓటర్ తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టింది. వీటి ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే జాతీయ స్దాయిలో ఎన్టీయే కూటమికి 350కి పైగా స్ధానాలు వస్తాయని అంచనా వేసింది. అలాగే ఈ ఏడాది ఎన్నికలు పెండింగ్ లో ఉన్న తమిళనాడులో ఓటరు నాడిని కూడా వెల్లడించింది.
తమిళనాడులో ఇండియా టుడే - సి ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాల ప్రకారం స్టాలిన్ నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చేసింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే తమిళనాడులోని మొత్తం 39 స్థానాల్లో ఇండియా కూటమి ఏకంగా 38 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి అసలు పోటీయే లేదని తేల్చింది.

ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడులో ఓటరు నాడి అధికార పక్షంవైపే ఉందని ఇండియాటుడే సర్వేలో తేలింది. అలాగే ఈ ఎన్నికలతో అరంగేట్రం చేస్తున్న హీరో విజయ్ పార్టీ టీవీకే ఒంటరిపోరుతో నష్టపోవడం ఖాయమని కూడా తేలిపోతోంది. ఇప్పటికే విజయ్ పార్టీ టీవీకే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని పదే పదే చెప్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమికి వ్యతిరేకంగా విజయ్ కు ఓటేసేందుకు జనం సిద్దంగా లేరని సర్వే తేల్చింది. అలాగే బీజేపీ-అన్నాడీఎంకే కూటమి కూడా గత ఎన్నికలతో పోలిస్తే మరింత బలహీనపడినట్లు తేలుస్తోంది. ఈ కూటమికి ఒక్క ఎంపీ సీటును మాత్రమే ఇండియాటుడే సర్వే ఇచ్చింది. విజయ్ పార్టీ టీవీకే కేవలం 15 శాతం ఓట్లు తెచ్చుకుంటుందని ఈ సర్వేలో తేలింది.
-
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
విజయ్ కు బిగ్ షాక్.. -
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
ఎన్నికల వేళ విజయ్ సంచలనం.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications