India-UK FTA: యూకేతో డీల్.. ఇకపై అవి చవక.. చవక!

India-UK FTA: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా లండన్‌లో బ్రిటీష్ ప్రధాని కియర్ స్టార్మర్‌తో సమావేశమయ్యారు. ఈ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఇరువురూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకాలు చేశారు. భారత్-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. స్టార్మర్ చేసిన ఘన స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రాత్మక ద్వైపాక్షిక చర్చల సందర్భంగా సంతకం చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆయన ప్రశంసించారు. "ఇది మా వినియోగదారులకు మంచి ఒప్పందం అవుతుంది. ఎందుకంటే దీని వల్ల బట్టలు, బూట్ల ధరలు తగ్గుతాయి. అదే సమయంలో, భారతీయ సముద్ర ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి" అని ఆయన అన్నారు. ఈ ఒప్పందం భారతదేశంలోని ప్రతి వర్గానికి లాభదాయకంగా ఉంటుందని, యూకే ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుతుందని, భారతదేశ పెట్టుబడులు పెరుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచ స్థిరత్వానికి కూడా బలం చేకూరుస్తుందని ఆయన అన్నారు. "ఇప్పుడు యూకే ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి" అని మోడీ స్పష్టం చేశారు.

India-UK FTA Signed Cheaper UK Products Bigger Market for Indian Exports

" విద్యా రంగంలో కూడా రెండు దేశాలు కలిసి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి. యూకేలోని ఆరు విశ్వవిద్యాలయాలు ఇండియాలో క్యాంపస్‌లను తెరుస్తున్నాయి, ఇటీవల గురుగ్రామ్‌లో ఒక క్యాంపస్ ప్రారంభించబడింది" అని ప్రధాని వెల్లడించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండించినందుకు స్టార్మర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణతో పాటు మధ్యప్రాచ్యంలోని పరిస్థితిపై కూడా తాము ఆలోచనలను పంచుకుంటూ వచ్చామని ఆయన అన్నారు. "ఈరోజు విస్తరణవాద ధోరణి కాదు, అభివృద్ధి ధోరణి నడుస్తోంది" అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.

భారీగా తగ్గనున్న ధరలు
ఎఫ్‌టీఏ అనేది రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసే ఒక ఒప్పందం. దీని కింద రెండు దేశాలు ఒకరి ఉత్పత్తులపై మరొకరు విధించే దిగుమతి సుంకాలు , టారిఫ్‌లు లేదా పన్నులను తగ్గిస్తాయి లేదా పూర్తిగా తొలగిస్తాయి. భారత్, యూకే మధ్య ఎఫ్‌టీఏ గురించి గత మూడు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం వల్ల తోలు, బూట్లు, బట్టలు తక్కువ ధరలకు ఎగుమతి చేయడం సాధ్యమవుతుంది, అయితే బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతి చౌకగా మారుతుంది. ముఖ్యంగా స్కాచ్, విస్కీ, జిన్ వంటి ఆల్కహాల్ పానీయాలపై దిగుమతి సుంకం 150 శాతం నుంచి 75 శాతం వరకు తగ్గనుంది. యూకేలో తయారయ్యే జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి కార్లపై ఉన్న సుంకం 100 శాతం నుంచి 10 శాతానికి దిగి రానుంది. వైద్య పరికరాల ధర తగ్గనుంది. ఎలక్ట్రిక్ మెషినరీ, ఆహార వస్తువులు, కాస్మెటిక్స్ ధరలు తగ్గుతాయి. ప్రధాని మోడీ కేబినెట్ బుధవారం ఎఫ్‌టీఏకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత, దీనికి బ్రిటిష్ పార్లమెంట్ నుండి ఆమోదం లభించాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+