భారత్ వర్సెస్ పాకిస్తాన్.. వాణిజ్య సంబంధాలు కట్, వీటి ధరలు పెరిగే చాన్స్!
భారతదేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడిన సంఘటన ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ లో చోటుచేసుకుంది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఉగ్రవాదులు పహల్గామ్ అందాలు చూడడానికి వచ్చిన పర్యాటకులను టార్గెట్ చేసి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొత్తం 26 మంది పర్యాటకులను చంపి అనేకమందిని గాయపరిచి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.
పాకిస్తాన్ తో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకున్న భారత్
ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం ఉగ్ర దాడి తర్వాత జరిపిన అత్యవసర భేటీ లలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా భారతప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చే సార్క్ వీసాలను రద్దు చేసింది.

రెండు దేశాల వాణిజ్యంపై ప్రభావం
అంతేకాదు భారతదేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాకిస్తాన్ అధికారిక ఎక్స్ ఖాతాని కూడా భారతదేశం నిషేధించింది.
పహల్గామ్ దాడి తర్వాత భారతదేశానికి పాకిస్తాన్ కు మధ్య ఉన్న సంబంధాలు క్షీణించాయి. ఇప్పటికే దాయాది దేశంతో ఉన్న శత్రుత్వం ఈ ఘటనతో మరింత పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల ప్రభావం రెండు దేశాల మధ్య వాణిజ్యం పైన పడింది.
వీటి ధరలు పెరిగే అవకాశం
పాకిస్తాన్ తో భారతదేశానికి సంబంధాలు క్షీణించిన తరుణంలో పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చే కొన్ని ఉత్పత్తుల పైన భారం పడనుంది. పాకిస్తాన్ నుండి పెద్ద ఎత్తున మన దేశానికి డ్రై ఫ్రూట్స్ వస్తాయి. భారత మార్కెట్లలో డ్రైఫ్రూట్స్ కు బాగా డిమాండ్ ఉంటుంది. ఇక పాకిస్తాన్ తో వాణిజ్యాన్ని క్లోజ్ చేయడంతో భారతదేశంలో డ్రైఫ్రూట్స్ ధరలు పెరగవచ్చు.
పాకిస్తాన్ నుండి దిగుమతి అయ్యే వీటి ధరల పెంపు
అంతేకాదు పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున సింధు ఉప్పును కూడా కొనుగోలు చేస్తాము ఇక అటువంటి సింధు ఉప్పు కూడా ప్రస్తుతం భారతదేశంలో ఖరీదైంది కాబోతుంది.
ఇక భారతదేశంలో వినియోగించే కళ్ళద్దాల ఆప్టికల్ లెన్స్ ను పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తాము. వీటి ధరలు కూడా తాజా పరిణామాలతో పెరుగుతాయని భావిస్తున్నారు.
ధరలు మండిపోయే అవకాశం
వీటితోపాటు భారతదేశం పాకిస్తాన్ నుంచి సిమెంటు, పండ్లు, ముల్తానీ మట్టి, పత్తి, ఉక్కు, తోలు వస్తువులను దిగుమతి చేసుకుంటుంది ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా కట్ కావడంతో ఈ వస్తువుల ధరలు మండిపోయే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications