సర్జికల్ స్ట్రైక్ వీడియో విడుదలకు మేము రెడీ: ఆర్మీ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో సర్జికల్ స్ట్రైక్ దాడులకు సంబంధించి వీడియో పుటేజీని విడుదల చేసేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత ఆర్మీ తేల్చి చెప్పింది.

ఈ వీడియో బయటకు వస్తే పాకిస్థాన్ నోరు కూడా మూయించినట్లు అవుతుందని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవల్సింది భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే అని ఆర్మీ వర్గాలు అన్నాయి.

ఆర్మీ విషయంలో రాజకీయాలు వద్దు ?

ఆర్మీ విషయంలో రాజకీయాలు వద్దు ?

ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి చిదంబరం, ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ నిరుపమ్ లాంటి వారు సర్జికల్ స్ట్రైక్ దాడుల వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. భారత ఆర్మీ విషయంలో రాజకీయాలు చెయ్యడం దారుణంగా ఉందని పలువురు మండిపడుతున్నారు.

పాక్ కు వత్తాసు

పాక్ కు వత్తాసు

భారత ఆర్మీ ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ దాడులు చెయ్యలేదని పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారం చేస్తుంది. అసత్యాలు చెప్పి అంతర్జాతీయ మీడియాను సైతం తప్పుదొవపట్టిస్తుంది. పాక్ కు భారత్ లోని కొందరు రాజకీయ నాయకులు వత్తాసుపలుకుతున్నారు.

వారి కళ్లు తెరిపించడానికే !

వారి కళ్లు తెరిపించడానికే !

ఇలాంటి సమయంలో సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన వీడియో పుటేజీని విడుదల చేసి పక్కా సాక్షాలు బయటపెట్టడం మేలని భారత ఆర్మీ భావిస్తుందని తెలిసింది. ఆ వీడియో బయటకు వస్తే పాక్ తో పాటు భారత్ లో అవకాశ రాజకీయాలు చేస్తున్న వారి నోర్లు మూయించినట్లు అవుతుందని అంటున్నారు.

చరిత్రలోనే లేదు

చరిత్రలోనే లేదు

వాస్తవానికి సైనిక రహస్యాలు బయటపెట్టడం అనేది ఇప్పటి వరకు భారత చరిత్రలోనే లేదు. త్రివిధ దళాలకు సంబంధించిన ఆపరేషన్లు ఏవైనా సరే, మేము చేశామని వారు చెప్పడం తప్పా అందుకు సంబంధించిన ఆధారాలు చూపించిన దాఖాలుల లేవు.

ఆర్మీ దాడుల వీడియో ఉంది

ఆర్మీ దాడుల వీడియో ఉంది

సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ మొత్తం మానవరహిత విమానాల సాయంతో చిత్రీకరిచండంతో పాటు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ఆ దృశ్యాలను ప్రధాన మంత్రితో పాటు ఆర్మీ ఉన్నత స్థాయి అధికారులు రాత్రంతా నిద్ర మేలుకుని లైవ్ లో చూసిన సంగతి తెలిసిందే.

రణబీర్ సింగ్ ఒక్కరే

రణబీర్ సింగ్ ఒక్కరే

సర్జికల్ స్ట్రైక్ దాడులు చేశామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ఒక్కరే అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికీ అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, అయినా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ అరోరా అన్నారు.

ఆరోజులు పోయాయి

ఆరోజులు పోయాయి

1962 నాటికి, ఇప్పటికి చాల తేడా ఉందని, పరిస్థితులు మారాయని, భారత సైన్యంలోని త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అయినా, శత్రువులపై ఎదురుదాడులు చెయ్యడానికి అయినా సిద్దంగా ఉన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ అరోరా అన్నారు. ఇప్పడు పరిస్థితి సున్నితంగా ఉందని, ఇకా ఈ విషయంలో తాను ఎలాంటి విషయాలు బయటకు చెప్పడం సరికాదని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ అరోరా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+