కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

రిపబ్లిక్ డే వేళ విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. జమ్ముకశ్మీర్ కథువా జిల్లా లఖాన్‌పూర్‌లో చాపర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒకరు తీవ్రగాయాలతో చనిపోగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.

Indian Army helicopter crashes in J&Ks Kathua district, 1 pilot dead

హెచ్ఏఎల్‌కి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్ కోట్ నుంచి చాపర్ వస్తున్నట్టు అధికారులు తెలిపారు. లఖాన్ పూర్ వద్ద దింపే ప్రయత్నం చేయగా కూలిపోయిందని కథువా ఎస్పీ శైలేంద్ర మిత్రా తెలిపారు. ఇద్దరు పైలట్లను మిలిటరీ బేస్ ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.

Recommended Video

    Round 9 of India-China Military Talks Underway to Resolve Ladakh Stand-off | Oneindia Telugu

    ఈ నెల ప్రారంభంలో మిగ్ 21 బిసన్ ఎయిర్ క్రాప్ట్ కూడా కూలిపోయిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ సూరత్ ఘడ్ వద్ద ప్రమాదం జరగగా.. పైలట్, చాపర్ దెబ్బతినకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సూరత్ ఘడ్ శ్రీ గంగా నగర్ జిల్లాలో ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మరో హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ఒక పైలట్ చనిపోవడం విషాదం నింపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+