వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2011లో సర్జికల్ స్ట్రైక్: పాక్ సైనికుల తలలు నరికి తెచ్చిన భారత్ ఆర్మీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాక్ భూభాగంలో 2016లో మొదటిసారి సర్జికల్ స్ట్రైక్ దాడులు జరగలేదని, 2011లోనే జరిగాయిని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో పేర్కొనింది. భారత ఆర్మీ 2011 సర్జికల్ స్ట్రైక్ దాడులు నిర్వహించిందని, ఆ సమయంలో 8 మంది పాక్ సైనికులు మరణించారని వెల్లండించింది.

Indian Army killed 8 Pakistanis in 2011 Surgical Strke

అందుకు సంబంధించిన అధికారిక ఆధారాలు, వీడియోలు, ఫోటోలు సైతం బహిర్గతం చేసింది. తాజాగా వెలుగు చూసిన నిజాలలో అత్యంత హింసాత్మకంగా భారత్, పాక్ మధ్య పరస్పరం కాల్పులు జరిగాయని వెలుగు చూసింది.

పాక్ కు గట్టి ఎదురుదెబ్బ: పీవోకేలో తిరగబడిన ప్రజలు

ఈ పరస్పర కాల్పుల్లో మొత్తం 13 మంది మరణించారని, అందులో ఐదు మంది భారత సైనికులు ఉన్నారని ఆగ్ల పత్రిక వెల్లడించింది. ఆ ఆంగ్ల దినపత్రిక కథనం మేరకు 2011 జులై 30వ తేదిన కుష్వార్ జిల్లా గుగల్జార్ పోస్టుపై పాక్ సైనికులు విరుచుకుపడ్డారు.

Indian Army killed 8 Pakistanis in 2011 Surgical Strke

ఐదు మంది భారత సైనికులను దారుణంగా హత్య చేసి వారి తలలు నరికేశారు. హవిల్దార్ దేవేందర్ సింగ్, జైపాల్ సింగ్ అనే ఇద్దరు సైనికుల తలలు పాక్ సైనికులు వారి వెంట తీసుకు వెళ్లారు. తీవ్రగాయాలైన ఓ భారత సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Indian Army killed 8 Pakistanis in 2011 Surgical Strke

2011 ఆగస్టు 30వ తేది భారత ఆర్మీ ఆపరేషన్ జింజర్ పేరుతో పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసింది. ఎనిమిది మంది పాక్ సైనికులను అంతం చేసింది. ముగ్గురు పాక్ సైనికుల తలల్ని భారత్ సైనికులు తమ వెంట తీసుకువచ్చి ప్రతీకారం తీర్చుకుందని ఆంగ్ల దినపత్రిక పేర్కొంది.

2011లో కుష్వారాలోని 28వ విభాగం ముఖ్య కార్యనిర్వహణ అధికారి సర్జికల్ స్ట్రైక్ దాడులకు ప్రణాళిక రచించారని ఆంగ్ల దినపత్రిక తన కథనంలొ స్పష్టం చేసింది. ఇప్పుడు రెండో సారి భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసి పాక్ కు గట్టి గుణపాఠం చెప్పింది.

English summary
According to the report, Pakistani Rangers had struck a remote army post in Gugaldhar ridge in Kupwara district on the afternoon of July 30, 2011. At the time of the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X