ఇదీ భారతీయ ఐటీ కంపెనీలు: ట్రంప్‌కు కౌంటర్

న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు లేదా భారతీయులు ఎక్కడా ఉద్యోగాలను దొంగిలించరని, ఉద్యోగాలను సృష్టిస్తారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అమెరికా సహా ఏ ఇతర దేశాల్లోనైనా భారత ఐటీ కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాన్నారు.

అంతేకానీ, ఉద్యోగాలను తీసుకు వెళ్లవని చెప్పారు. బెంగళూరులో భారత ఐటీ రంగ ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

మల్టీనేషనల్ కంపెనీల వ్యాపారంలో భారతీయుల భాగస్వామ్యం

మల్టీనేషనల్ కంపెనీల వ్యాపారంలో భారతీయుల భాగస్వామ్యం

మల్టీనేషనల్‌ కంపెనీలు పెద్దస్థాయిలో వ్యాపారం చేసి ఉంటే అందులో భారతీయుల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందన్నారు. ఇది పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు.

మన ఐటీ కంపెనీలకు తిరుగులేదు

మన ఐటీ కంపెనీలకు తిరుగులేదు

భారతీయ ఐటీ కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎదురులేదని, ఇప్పుడు డిజిటల్‌ ఇండియాతో విస్తృత మార్కెట్‌ ఏర్పడిన దృష్ట్యా తిరిగి భారత్‌లో సేవలను విస్తరిస్తున్నాయి అని అన్నారు.

4 లక్షల ఉద్యోగాలను సృష్టించాం

4 లక్షల ఉద్యోగాలను సృష్టించాం

ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ట్యాక్స్ రెవెన్యూ రూపంలో 22 బిలియన్ డాలర్లను గత అయిదేళ్లలో అమెరికాకు చెల్లించిందన్నారు. అలాగే నాలుగు లక్షల ఉద్యోగాలను సృష్టించాయని చెప్పారు.

ట్రంప్ కఠిన వైఖరి..

ట్రంప్ కఠిన వైఖరి..

హెచ్‌-1బీ వీసాల విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠిన వైఖరి అనుసరిస్తున్న విషయం తెలిసిందే. వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు అధికారిక ఉత్తర్వు కూడా జారీ చేశారు. అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలు తన్నుకుపోతున్నాయని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+