అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఇండియన్ మృతి, ఖండించిన సుష్మా
అమెరికాలో మరో ఇండియన్ మరణించాడు. దోపిడి దొంగల చేతిలో 26 ఏళ్ళ భారతీయుడు హత్యకు గురయ్యాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
వాషింగ్టన్: అమెరికాలో మరో ఇండియన్ మరణించాడు. దోపిడి దొంగల చేతిలో 26 ఏళ్ళ భారతీయుడు హత్యకు గురయ్యాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
పంజాబ్ కు చెందిన విక్రమ్ జర్యాల్ నెలరోజుల క్రితమే అమెరికా వెళ్ళాడు. ప్రస్తుతం యకిమా సిటీలోని ఏఎం-పీఎం గ్యాస్ స్టేషన్ లో క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు విక్రమ్ పనిచేస్తోన్న గ్యాస్ స్టేషన్ కు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. విక్రమ్ స్టేషన్ కౌంటర్ లో ఉన్న నగదును వారికిచ్చాడు.
అయినా ఆ ఇద్దరు దుండగుల్లో ఓకరు విక్రమ్ పై కాల్పులు జరిపారు. అనంతరం వారు పారిపోయారు.ఈ ఘటన జాత్యంహకార దాడే అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దుండగులు వెళ్ళిపోయిన తర్వాత కొందరు విక్రమ్ ను గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు ప్రకటించారు.ఈ ఘటనను కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు.విక్రమ్ సోదరుడు ట్విట్టర్ ద్వారా సుష్మా స్వరాజ్ దృష్టికి తెచ్చారు.అన్ని రకాల సహయాన్ని అందిస్తానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications