కర్ణాటకలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్... అప్రమత్తమైన పోలీసులు, విస్తృత తనిఖీలు
బెంగుళూరు: కర్ణాటకకు ఉగ్రవాదుల నుంచి భారీ ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రాష్ట్రం నుంచే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఉగ్రవాదులు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఇంటిలిటెన్స్ వర్గాలు పక్కా ఆధారాలతో కర్ణాటక పోలీసులను హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు.
కర్ణాటక రాష్ట్రం మొత్తం విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రతి అంగుళం కూడా జల్లెడ పడుతున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా మైసూరు, మంగుళూరు, బెళగావి, హుబ్లీలను ఉగ్రవాదులు తమ స్లీపర్ సెల్స్‌గా మలుచుకుంటున్నారని సమాచారం.

ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్లీపర్ సెల్స్ లోని ఉగ్రవాదులు ప్రస్తుతానికి నిద్రాణంగా ఉంటున్నా.... ఆయా ఉగ్రవాద సంస్ధల నుంచి ఆదేశాలు రాగానే మూకుమ్మడి దాడులకు చేసే అవకాశం ఉందని సమాచారం.
నిఘా వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు నాలుగు నగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిఘాను పెంచడంతో పాటు రాష్ట్రం మొత్తం హైఅలర్ట్‌ను ప్రకటించారు. ఇటీవల కాలంలో బెంగుళూరులోని చర్చి స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అనుమానితులుగా భావించిన నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అనుమానిత ఉగ్రవాది ఒకడు కర్ణాటకలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్ధులను ఇండియన్ ముజాహిద్దీన్ సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదంలోకి ప్రేరేపిస్తున్నట్లు అనుమానలు రేకేతిస్తున్నాయి. వీరే స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తున్నారేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.












Click it and Unblock the Notifications