Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విమాన ప్రమాదంలో మరణించిన భారతీయురాలి ఫ్యామిలీకి రూ.317 కోట్ల పరిహారం

బోయింగ్ విమాన ప్రమాద ఘటనలో మరణించిన ఒక భారతీయ కుటుంబానికి 317 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 మాక్స్ విమానం ప్రమాదానికి గురికాగా ఈ ప్రమాదంలో భారతీయ పౌరురాలు అయిన శిఖా గార్గ్ మరణించారు.

బోయింగ్ విమాన ప్రమాదంలో మరణించిన శిఖా గార్గ్
ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్న శిఖ గార్గ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సులో పాల్గొనేందుకు నైరోబి కి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇథియోపియా లోని బోలే అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని నిమిషాలకే ఆ విమానం కుప్ప కూలిపోవడంతో ఈ ప్రమాదంలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటన లోనే శిఖ గార్గ్ కూడా మరణించారు.

Indian national shikha garg died in plane crash family gets Rs 317 crore compensation

కోర్టులో బోయింగ్ విమాన కంపెనీపై దావా వేసిన శిఖా గార్గ్ కుటుంబం
ఆ తర్వాత బోయింగ్ ఈ కేసులలో చాలా వరకు పరిహారం అందించి పరిష్కరించింది. అయితే శిఖ గార్గ్ ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్ గా పనిచేయడం, ఆ విమాన ప్రమాదం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోవడం తదితర అంశాలతో పాటు, విమాన డిజైన్ లో లోపాలు ఉన్నాయని, ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడం లో బోయింగ్ విఫలమైందని ఆరోపిస్తూ శిఖ గార్గ్ కుటుంబం కోర్టులో దావా వేసింది.

శిఖా కుటుంబానికి అనుకూలంగా తీర్పు
ఈ క్రమంలోనే చికాగోలోని ఫెడరల్ జ్యూరీ ఈ వారంలో శిఖ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. పరిహారంతో పాటు ఇప్పటివరకు ఆయన ఖర్చులను కూడా కలిపి ఇవ్వాలని 35.85 మిలియన్ డాలర్లను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆరేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత శిఖ కుటుంబానికి ఈ విజయం లభించింది.

తాజా తీర్పుతో శిఖా గార్గ్ ఫ్యామిలీకి రిలీఫ్
భారతీయ సాంప్రదాయాలను ఎక్కువగా ఇష్టపడే శిఖ గార్గ్ ఐక్యరాజ్యసమితి కన్సల్టెంట్ గా పనిచేయడంతో పాటు ఆమె మరణించిన సమయంలో పీహెచ్డీ కూడా చేస్తున్నారు. చీర కట్టుకునే ఎక్కువగా ఇష్టపడే శిఖ గార్గ్ ప్రమాదం జరిగిన రోజు చీరకట్టులోనే విమానాన్ని ఎక్కారని, ఆ తర్వాత తిరిగిరాని లోకాలకు చేరిపోయారని వారి కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా తీర్పు ఆమె కుటుంబానికి కాస్త ఉపశమనం అని చెప్పాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+