పాక్ పై యుద్దం ఖాయమా ? అరేబియా సముద్రంలో నావిగేషన్ హెచ్చరికలు జారీ..!
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ఎలాంటి ప్రతీకార చర్య తీసుకోవాలనే విషయంలో కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. భారత్ తరహాలోనే పాకిస్తాన్ కూడా అణ్వస్త్రాలు కలిగిన దేశం కావడం, అక్కడి రాజకీయ నేతల కంటే ఆర్మీ బలమైనది కావడం, అక్కడి అణ్వస్త్రాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండటంతో కేంద్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్ పై ఏదో ఒక బలమైన చర్య తీసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇప్పటికే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ లతో భేటీ అయ్యారు.
పహల్గాం దాడి తర్వాత భారత్ నుంచి గట్టి ప్రతిస్పందన ఉండొచ్చన్న అంచనాలో ఉన్న పాకిస్తాన్ నేవీ అరేబియా సముద్రంలో విన్యాసాలు ప్రారంభించింది. అలాగే భారత్ కూడా పాకిస్తాన్ పై దాడికి సన్నాహకంగా అరేబియా సముద్రంలో డ్రిల్స్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ అరేబియా సముద్రంలో ప్రయాణించే నౌకలకు మన నేవీ నావిగేషన్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుత పరిస్ధితుల్లో అరేబియా సముద్రంలో ప్రయాణించకపోవడమే మంచిందని ఇందులో పేర్కొంది.

భారత నావికాదళం కింద పనిచేసే భారతదేశ జాతీయ హైడ్రోగ్రాఫిక్ కార్యాలయం అరేబియా సముద్రంలో నౌకలకు ఈ నావిగేషన్ హెచ్చరిక హెచ్చరికను జారీ చేసింది. భద్రతా కారణాలతో వాణిజ్య నౌకలు ఈ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించినట్లు ఇందులో తెలిపింది. కీలకమైన సముద్ర మార్గాల్లో తన నౌకాదళం తన విన్యాసాలను ముమ్మరం చేయడంతో పాకిస్తాన్ ఇప్పటికే తన నౌకాదళ హెచ్చరికలను అమలు చేసింది.పాకిస్తాన్ నౌకాదళం గత కొన్ని రోజులుగా అరేబియా సముద్రంలో తీవ్రమైన విన్యాసాలు, లైవ్ ఫైరింగ్‌లను కూడా నిర్వహిస్తోంది.
పహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యలను భారతదేశం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార దాడిని అంచనా వేస్తూ పాకిస్తాన్ కూడా అలర్ట్ గా ఉండటంతో అరేబియా సముద్రంలో ఉద్రిక్త పరిస్దితులు కనిపిస్తున్నాయి. భారత్ గతానికి భిన్నంగా ఈసారి సముద్రంపై దాడిని ప్రారంభిస్తుందా అన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగానే నావిగేషన్ హెచ్చరికలు జారీ చేశారా అన్న చర్చ జరుగుతోంది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications