2040 నాటికి జాబిల్లిపైకి మొదటి భారతీయుడు, 2035 నాటికి స్పేస్ స్టేషన్: ఇస్రోకు మోదీ దిశానిర్దేశం
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చరిత్రలో 2023 సంవత్సరం చిరస్థాయిగా నిలిచిపోనుంది. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 మిషన్లను విజయవంతం చేసింది ఇస్రో. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను అంతరిక్ష ప్రయాణం సజావుగా సాగుతోంది. త్వరలో అది లాగ్రాంజ్ పాయింట్‌ను చేరుకోనుంది.
ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు ఈ రెండింటి వద్దే ఆగట్లేదు. మరో సంచలన మిషన్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. అదే- గగన్‌యాన్. మానవ సహిత ప్రయోగం ఇది. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్. 2024 మార్చి నాటికి ఇది కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 21వ తేదీన గగన్‌యాన్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది ఇస్రో.

ప్రస్తుతం గగన్‌యాన్‌కు సంబంధించిన ప్రయోగాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రయోగం కోసం జీఎస్ఎల్వీ ఎంకే 3 రాకెట్‌ను వినియోగించనుంది. రాకెట్ క్రయోజెనిక్ ఇంజిన్ సామర్థ్యాన్ని ఇస్రో పరీక్షించింది కూడా. తమిళనాడులోని మహేంద్రగిరి వద్ద గల లిక్విడ్ ప్రొపల్షన్ రీసెర్చ్ సెంటర్‌లో రాకెట్ ఇంజిన్ సీఈ-20ని 720 సెకెండ్ల పాటు మండించింది. ఈ టెస్ట్ విజయవంతంమైనట్లు తెలిపింది.
గగన్‌యాన్‌లో భాగంగా మనుషులను లో- ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది ఇస్రో. భూఉపరితలంపై నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తారు. అయిదు నుంచి ఏడు రోజుల పాటు అక్కడే గడుపుతారు. అనంతరం మళ్లీ భూమిపైకి తిరిగి వస్తారు. క్రూ మాడ్యుల్ అంటే.. మనుషులను తీసుకెళ్లడానికి వీలుగా ఉండే క్యాబిన్, సర్వీస్ మాడ్యుల్ అంటే.. రెండు లిక్విడ్ ప్రొపెల్లంట్ ఇంజిన్స్‌ను పేలోడ్స్‌గా పంపిస్తుంది.
ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తరువాత మానవ సహిత మిషన్‌ను చేపట్టిన నాలుగో దేశంగా నిలుస్తుంది భారత్. మనుషులను అంతరిక్షంలోకి పంపించడం.. మళ్లీ వారిని విజయవంతంగా భూమిపైకి తీసుకుని రావడం, అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సేవలను అందించడం.. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
ఇంకొద్ది రోజుల్లో గగన్‌యాన్ మిషన్‌ను ప్రయోగించాల్సి ఉన్న నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమక్ష సమావేశాన్ని నిర్వహంచారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
గగన్‌యాన్ మిషన్ వివరాలను వారు మోదీకి వివరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ 3 అన్‌క్రూడ్ మిషన్‌లతో సహా సుమారు 20 టెస్టింగ్స్ పూర్తయ్యాయని తెలిపారు. 2025 నాటికి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు పూనుకుంటామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారికి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను నెలకొల్పాలని ఆదేశించారు. 2,040 నాటికి మొట్ట మొదటి భారతీయుడిని చంద్రునిపైకి పంపించాలని సూచించారు. అలాంటి ప్రతిష్ఠాత్మక మిషన్‌లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications