డీఎంకేకు ఐయూఎంఎల్ గుడ్ బై, తెగిన 60 ఏళ్ల బంధం - విజయ్ మంత్రాంగంతో..!!
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకేకు వరుస షాక్ లు తగులుతున్నాయి. అటు అన్నాడీఎంకే నుంచి సొంత ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుంటే.. ఇటు డీఎంకే నుంచి మిత్రపక్షాలు దూరం అవుతున్నాయి. టీవీకేకు మద్దతు కారణంగా కాంగ్రెస్ - డీఎంకే మధ్య బంధం తెగిపోయింది. ఇక.. 1962 నుంచి డీఎంకేతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్న ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) గుడ్ బై చెప్పింది. విజయ్ తో కలిసి తమ రాజకీయ ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించింది.
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా అధికార ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఆ కూటమికి గుడ్ బై చెప్పటం సంచలనంగా మారుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎన్నికలకే పరిమితం కాకుండా సామాజిక సమీకరణా ల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చింది. అయితే, గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న తీవ్ర భేదాభిప్రాయాలు, శ్రేణుల మధ్య అసంతృప్తి చివరకు కూటమి నుంచి శాశ్వత ఉపసంహరణకు దారితీశాయి. ఒక బలమైన మైనారిటీ భాగస్వామిని కోల్పోవడం అధికార డీఎంకే శ్రేణులకు గట్టి ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో తలెత్తిన జటిలమైన సమస్యలుగా తెలుస్తోంది.

విజయ్ కేబినెట్ లో చేరటంతో
గత కొంత కాలంగా జరిగిన ఎన్నికల్లో ముస్లిం లీగ్ ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఐయూఎంఎల్ బలంగా ఉన్న ఉత్తర మరియు దక్షిణాది జిల్లాల్లో డీఎంకే స్థానిక నేతల పెత్తనం పెరగడం ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. మరోవైపు, పార్టీ సీనియర్ల అభిప్రాయం ప్రకారం, ఐయూఎంఎల్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా డీఎంకే ప్రవర్తించడం కూడా ఈ నిర్ణయానికి దారితీసింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం లీగ్ మూడు స్థానాల్లో పోటీ చేసి రెండు సీట్లు గెలుచుకుంది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా నిలిచిన సమయంలో డీఎంకేతో కొనసాగటం పైన సందేహాలు మొదలయ్యాయి. ముస్లిం లీగ్ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్ టీవీకే ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. డీఎంకేతో దశాబ్దాలుగా ఉన్న స్నేహాన్ని వదులుకోవడం కష్టమైనప్పటికీ, రాష్ట్రంలో వచ్చిన రాజకీయ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐయుఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కె.ఎం. ఖాదర్ మొహిదీన్ స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications