IndiGo Crisis: ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్..! రిఫండ్స్, వసతిపై కీలక ప్రకటన..!
మన దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఇండిగో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీని కారణంగా వందల సంఖ్యలో విమానాలు రద్దు చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రోజురోజుకూ ఈ సమస్య తీవ్రమవుతోంది. దీంతో తిరిగి ఇండిగో విమానాలు యథావిధిగా ఎప్పుడు ఎగురుతాయన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఇండిగో ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇండిగోలో అంతర్గత సమస్యల కారణంగా ఇవాళ కూడా దేశవ్యాప్తంగా 550 విమానాలు రద్దయ్యాయి. ఓ దశలో ఢిల్లీ మినహా దేశంలో నడిచే ఇతర అన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. అదే సమయంలో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో లగేజీ గందరగోళంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తమ టికెట్ల రిఫండ్స్, వసతి విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో ఓ ప్రకటన చేసింది.

ఇందులో డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 15 మధ్య రద్దు చేసిన అన్ని విమానాలకు పూర్తి టికెట్ మొత్తాల్ని తిరిగి ఇస్తామని ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులు ఎలా టికెట్ బుక్ చేసుకున్నారో అదే అకౌంట్లకు డబ్బులు వెనక్కి ఇస్తామని తెలిపింది. అలాగే ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడానికి, విమానాశ్రయాలలో ఆహారం, స్నాక్స్‌తో పాటు వేలాది హోటల్ గదులు, ట్రావెల్ ఆప్షన్స్ ను ఇస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. అలాగే సీనియర్ సిటిజన్లకు సాధ్యమైన చోట లాంజ్ ఇస్తామని తెలిపింది.

— IndiGo (@IndiGo6E) December 5, 2025
అలాగే దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలలో తీవ్ర గందరగోళానికి దారితీసిన విమానాల రద్దుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఇండిగో తమ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. మరోవైపు తమ విమానాల కార్యకలాపాలను స్థిరీకరించడానికి కొత్త నిబంధనల నుంచి సడలింపు ఇవ్వాలని డీజీసీఏను కోరింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం ఇండిగో ఎయిర్‌లైన్ ఓటీపీ మంగళవారం 35 శాతం నుండి బుధవారం 19.7 శాతానికి పడిపోయింది. గురువారం అయితే 8.5 శాతానికి పడిపోయింది. చాలా కాలంగా సమయపాలనను కచ్చితంగా పాటిస్తున్న ఇండిగోకు తీవ్ర ఎదురుదెబ్బగా మారింది. ఇన్ని పరిణామాల మధ్య కూడా డిసెంబర్ 8 వరకు ఇలా విమానాల ర్దదదు సమస్యలు ఉంటాయని, ఆ తర్వాత కూడా సర్వీసులు తగ్గిస్తామని డీజీసీఏకు తెలిపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications