Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండిగో ఈజ్ బ్యాక్..? రోజుకు 2 వేలకు పైగా విమానాల రాకపోకలు

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. సంక్షోభం కారణంగా వేల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇండిగోలో ప్రయాణ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం.. వరుసగా రెండో రోజు 2 వేలకుపైగా విమానాలను నడిపినట్లు పేర్కొంది. అలాగే గత ఐదు రోజులుగా తమ కార్యకలాపాలు నిలకడగా కొనసాగుతున్నట్లు ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.

మరోవైపు విమాన రద్దుపై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) డిసెంబర్ 12, శుక్రవారం.. నలుగురు విమాన కార్యకలాపాల ఇన్‌స్పెక్టర్లను (FOIలు) తొలగించింది. ఈ అధికారులు విమానయాన సంస్థల కార్యకలాపాల పర్యవేక్షణకు కీలక బాధ్యతలు వహిస్తున్నారు. విమానాలు రద్దు నేపథ్యంలో వారిని విధుల నుంచి తొలగించడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా విమానాలు భారీ ఎత్తున రద్దైన నేపథ్యంలో.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. ఇండిగో సంస్థకు తన కార్యకలాపాలను 10 శాతం తగ్గించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో, ఇటీవల 5,000 కి పైగా విమానాలను రద్దు చేయడంతో, అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు.

ఇక పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తన కార్యకలాపాలను 10 శాతం తగ్గించిన ఇండిగో.. డిసెంబర్ 13, శనివారం నుంచి వరుసగా రెండో రోజు 2,000 కు పైగా విమానాలను విజయవంతంగా నడపుతోంది. ఈ విషయాన్ని ఎయిర్‌ లైన్ సంస్థ పేర్కొంది. గత ఐదు రోజులుగా నిరంతర కార్యకలాపాలు సాగిస్తున్నామని.. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చినట్లు సంస్థ వివరించింది.

IndiGo Flights Back to Normal Over 2 000 Operated for Second Straight Day

ఈ మేరకు ఇండిగో సంస్థ ఈ విధంగా స్పష్టం చేసింది. మొత్తం 138 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వివరించింది. విమానాల రాకపోకలకు సంబంధించి సమయపాలన కూడా సాధారణ స్థాయికి చేరుకుందని ఇండిగో సంస్థ పేర్కొంది. కాగా ఈ నెల ప్రారంభంలో ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+