టేకాఫ్.. ల్యాండింగ్... రాత్రంతా విమానంలోనే.. కనీసం తిండి కూడా పెట్టలేదు.. ప్రయాణికుల గగ్గోలు
ముంబై : మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో విమానాలు, రైలు సర్వీసులను కూడా తగ్గాయి. అయితే వర్షాలతో ఇండిగో విమానంలో జరిగిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి చూసింది. వర్షాలతో ప్రయాణికులంతా విమానంలో తమ సీట్లకే అతుక్కుపోయారు. అక్కడినుంచి లేవొద్దని సిబ్బంది తమను బెదిరించారని ప్యాసెంజర్స్ వాపోయారు. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. ముంబైలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
వర్షాలతో దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. ఇప్పటికే 20 సర్వీసులను ఇండిగో ఆపివేసినట్టు పేర్కొంది. వర్షాలతో కొందరు తమ టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే బుధవారం రాత్రి 7.55 గంటలకు ముంబై నుంచి ఇండిగో విమానం బయల్దేరింది. కానీ వాతావరణం బాగోలేకపోవడంతో వెంటనే నిలిపివేశారు. వర్షాల వల్ల రాత్రంతా తమను విమానంలోనే ఉంచారని ప్రయాణికులు వాపోయారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ముంబై నుంచి విమానం బయల్దేరిందని .. ఉదయం 8 గంటలకు జైపూర్ చేరుకున్నామని ప్రయాణికులు తెలిపారు.

రాత్రి పూట కూడా తమను సిబ్బంది కనీసం సీట్ల నుంచి కూడా లేవనీయలేదని పేర్కొన్నారు. కనీసం నైట్ డిన్నర్ కూడా పెట్టలేదని పేర్కొన్నారు. ఒకవేళ తాము లేస్తామని అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను పిలుస్తామని భయపెట్టారని గుర్తుచేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో విమానం సీట్లకు తాము రాత్రంతా అతుక్కుపోయామని ప్రయాణికులు వాపోయారు. దీనిపై విచారణ జరుపుతామని డీజీసీఏ పేర్కొన్నది. ప్రయాణికులతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications