వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

23 రోజుల్లోనే రేపిస్ట్‌కు ఉరిశిక్ష: ఇండోర్ కోర్టు సంచలన తీర్పు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇండోర్: నాలుగు మాసాల పసిసాపపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కేసు నమోదైన 23 రోజుల్లోనే ఉరిశిక్షను విధించింది. దేశంలోనే అత్యంత త్వరగా తీర్చిచ్చిన కేసుగా ఈ కేసు రికార్డులకెక్కింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత నెలలో నాలుగు నెలల పసిపాపను అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకొంది.ఈ కేసులో సునీల్‌ భీల్‌(21) అనే వ్యక్తికి శనివారం జిల్లా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.

Indore court gives death to man who raped and murdered baby, verdict announced in record time

దేశంలోనే అతి వేగవంతమైన తీర్పును ఇండోర్‌ జిల్లా కోర్టు రికార్డు సృష్టించింది. పసిగుడ్డుపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డ ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు నమోదైన కేవలం 23 రోజుల్లోనే ముద్దాయికి మరణ శిక్షను విధించింది.

ఇండోర్ నగరంలోని రాజ్‌వాడా ఫోర్ట్‌ సమీపంలో త‌ల్లిప‌క్క‌నే నిద్రిస్తున్న నాలుగు నెల‌ల ప‌సికందును ఎత్తుకెళ్లిన సునీల్‌ అత్యాచారం చేసి అనంత‌రం హ‌త్య చేశారు. . సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఏప్రిల్ 21న సునీల్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను పూర్తి చేసి నిందితుడికి శనివారం నాడు శిక్షను విధించారు.

English summary
In what can be called the quickest trial in the country, a district court awarded death sentence to a 21-year-old man in horrific rape and murder of a four-month-old baby in Indore on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X