కోర్టులో రాయిలా ఇంద్రాణి: ఏడ్చేసిన కూతురు
ముంబై: కూతురు షీనా బొరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖార్జియాను పోలీసులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంద్రాణిని కస్టడీలో పోలీసులు భౌతికపరమైన హింసకు గురి చేశారని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. అదే విషయాన్ని ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు కూడా చెప్పినట్లు సమాచారం.
ఇంద్రాణిని పోలీసులు 80 నుంచి 90 గంటల పాటు విచారించారని, న్యాయపరమైన కౌన్సెలింగ్‌కు కూడా అవకాశం ఇవ్వలేదని లాయర్లు చెప్పారు. కాగా, కోర్టులో ఇంద్రాణి నిశ్చలంగా రాయిలా ఉండిపోగా, ఆమె కూతురు విధి మాత్రమే ఏడ్చేసింది.

విధి సోమవారం కోర్టుకు వచ్చారు. కాగా, కుమారుడు మిఖాయిల్ బోరాను హత్య చేయడానికి ఇంద్రాణి ముఖార్జియా కాంట్రాక్ట్ కిల్లర్‌ను సంప్రదించిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షీనాను 2012లో హత్య చేసిన సమయంలోనే మిఖాయిల్ బోరాను కూడా అంతమొందించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.
తన పిల్లలు షీనా బొరా, మిఖాయిల్ బొరాలను ఇంద్రాణి అందరికీ తన సోదరిగా, సోదరుడిగా పరిచయం చేసింది. షీనా బొరా హత్య కేసులో ఇంద్రాణితో పాటు పోలీసులు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, డ్రైవర్ శ్యామ్‌ను అరెస్టు చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications