సింధూ నదీ జలాలపై భారత్, పాకిస్థాన్ సంచలన నిర్ణయం..??

సింధూ నది జలాల ఒప్పందం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగింది. 1960 లో ఇరు దేశాల మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు అలాగే ఇండస్, జీలమ్, చీనాబ్ నదులు పాకిస్థాన్ కు కేటాయించడం జరిగింది. ఇక సింధూ నది భారత్- పాకిస్థాన్ లో దాదాపు 30 కోట్ల మందికి లైఫ్ లైన్ గా మారింది. ఇరు దేశాల్లో వ్యవసాయం, పరిశ్రమలు, జీవనోపాధి, ఎనర్జీ ఉత్పత్తికి సింధూ నది ఎంతగానో ఉపయోగపడుతోంది.

సింధూ నదీ జలాల వినియోగంపై ఎప్పుడో 1960లో భారత్, పాకిస్థాన్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే దాదాపు 6 దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య జరిగిన ఎన్నో యుద్ధాలు, ఆటుపోట్లను తట్టుకుంటూ కోట్ల మంది అవసరాలను తీర్చుతూ వస్తోంది సింధూ నది. కానీ గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దాంతో పాకిస్థాన్ కు నీళ్లు బంద్ అయ్యాయి.

ఇక పాకిస్థాన్ లోని వ్యవసాయ రంగానికి, తాగునీటికి సింధూ నది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అయితే ఈ నీటిని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో అక్కడి ప్రజలకు నీటి కష్టాలు తీవ్రతరం అయ్యాయి. వేసవి కావడంతో ఆ పరిస్థితి మరింత పెరిగింది. నీటి కొరత కారణంగా పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. ఇక సింధూ నదిపై కిషన్ గంగ, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ లపై భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్థాన్ ఇదే వ్యవహారంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించింది. అయితే భారత్ మాత్రం ఈ వివాదంలో న్యూట్రల్ ఎక్స్ పర్ట్ ప్రక్రియను కోరుతోంది.

Indus Waters Treaty Experts Say More Talks Needed Between India and Pakistan India Pakistan Indus

ఇక సింధూ నది జలాల ఒప్పందంలోని అప్పటి నిబంధనలను సవరించాలని భారత్ కోరుతోంది. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ, జనాభా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని భారత్ వాదిస్తోంది. అయితే సింధూ నది జలాల ఒప్పందంపై ఇరు దేశాల మధ్య తిరిగి చర్చలు ప్రారంభం కావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హిమాలయాల్లో మంచు కరగడం అలాగే వర్షపాతంలో మార్పుల కారణంగా నదీ ప్రవాహంపై ప్రభావం పడుతోందని దాంతో ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారం ఎంతైనా అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+