Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరేళ్ల కొడుకుపై తాగుబోతు తండ్రి అమానుషం.. కత్తితో పొడిచి..

తాగి ఇంటికొచ్చాక భార్య వాగ్వాదానికి దిగిన భర్త.. ఆ కోపంలో కొడుకుపై కత్తితో దాడి చేశాడు.

బుర్ద్వాన్: ఆరేళ్ల కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన పశ్చిమ బంగాలోని బుర్ద్వాన్ లో ఆదివారం నాడు చోటు చేసుకుంది. తాగిన మత్తులో అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కొడుకును పొడిచిన తర్వాత తనను తాను ఆ తండ్రి గాయపరుచుకోవడం గమనార్హం.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పిక్‌నిక్ కోసమని స్నేహితులతో కలిసి బయటకెళ్లిన మాఝీ తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్యతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో ఆరేళ్ల కొడుకు కృష్ణ గోపాల్ ను మాఝీ కత్తితో గాయపరిచాడు.

 Inebriated father hacks 6-year-old son to death, injures self

కొడుకును గాయపరిచిన తర్వాత తనను తానే కత్తితో గాయపరుచుకున్నాడు. భర్త దుశ్చర్యకు భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా ఆ ఇంటికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే మెడ వద్ద చాలా లోతుగా గాయం కావడంతో కృష్ణ గోపాల్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

తాగి ఇంటికొచ్చిన మాఝీ.. భార్యతో గొడవపడి ఆ కోపాన్నంతా కొడుకు మీద చూపించాడని స్థానికులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+