వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిశువుల్ని ఉల్లిగడ్డల్లా అమ్మేస్తున్నారు: కోర్టు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

Infants sold in 'Baccha Bazaar' like potatoes, tomatoes: Delhi court
న్యూఢిల్లీ: చిన్నారుల్ని, శిశువుల్ని మార్కెట్‌లో కూరగాయల మాదిరిగా అమ్మేస్తున్నారంటూ ఢిల్లీ కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టమాటాలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల మాదిరిగా మార్కెట్లో లభ్యమవుతున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించింది. దత్తత పేరుతో అమ్మకాలు, కొనుగోళ్ళు యధేచ్ఛగా సాగిపోతున్నాయని మండిపడింది.

భారత శిక్షాస్మృతి కింద వీరిని నేరస్థులుగా పరిగణించి శిక్షించేందుకు చట్టసవరణ చేయాలని అడిషనల్ సెషన్స్ జడ్జి కామిని లావ్ శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా సూచించారు. చాలా దేశాల్లో పిల్లల అమ్మకాలు, కొనుగోళ్లను నేరమని, అయితే దత్తత ముసుగులో ఈ వ్యవహారం నిరాటంకంగా సాగిపోతోందని ఆమె తెలిపారు. 21 ఏళ్ల క్రితం లా కమిషన్ ప్రతిపాదనలకు చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరాన్ని న్యాయమూర్తి నొక్కిచెప్పారు.

మహిళలను, మైనర్లను అమ్మినా, పాలుపంచుకున్నా ఏడేళ్ల జైలుశిక్ష విధించాలని 1993లో లా కమిషన్ ప్రతిపాదించింది. ఈరోజు వరకు ఆ ప్రతిపాదనలు అమలుకు నోచుకోకపోవడం వల్లే చిన్నారులు మార్కెట్‌లో కూరగాయల మాదిరిగా అమ్ముడవుతున్నారని చెప్పారు. నెలరోజుల వయసున్న శిశువు అమ్మకానికి సంబంధించిన కేసు విచారణలో న్యాయమూర్తి పై విధంగా వ్యాఖ్యానించారు.

శిశువును రూ. లక్షకు అమ్మేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత చివరి క్షణంలో ఈ వ్యవహారం బట్టబయలైంది. పోలీసులు ఈ కేసును ఛేదించి నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళయి ఎనిమిదేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో శిశువును కొనుక్కునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అమ్మకానికి సూత్రధారిగా వ్యవహరించిన నర్సును సైతం పోలీసులు అరెస్టు చేశారు. దోషులు ముగ్గురికి మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

English summary
Selling children in the garb of adoption is illegal, a Delhi court has held while urging the authorities to make it an offence punishable under the Indian Penal Code.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X