ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నియంత్రణలోనే ఉన్న ద్రవ్యోల్బణం
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, అదేసమయంలో రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ.. మోడీ సర్కార్ ద్రవ్యోల్బణాన్ని మాత్రం నియంత్రిస్తూ శభాష్ అనిపించుకుంది. మంచి పంటలు, దిగుబడి రావడంతో ఆహార ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో ఇది ప్రభుత్వానికి కొంత సహాయపడిందనే చెప్పొచ్చు. గత నెల సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ 5.13శాతం పెరిగింది.ఇది ఆగష్టులో 4.53శాతంగా ఉన్నింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టోకు ధరల సూచీ ఏడాది పెరుగుదల 4.98శాతంగా ఉంది. ఇదిలా ఉంటే వినియోగదారుల ధరల సూచీ మాత్రం 3.88శాతానికి ఇదే సమయంలో పెరిగింది. ఇది గత మూడు త్రైమాసికాల్లో 4శాతంగా ఉన్నింది. ద్రవ్యోల్బణం పెరగినప్పటికీ అది మరీ ప్రమాదకర స్థాయికి చేరలేదు. ఇది ముడిచమురు ధరలు పెరుగుతున్న క్రమంలో ద్రవ్యోల్బణం పెరగకపోవడం శుభపరిణామమే అని చెప్పాలి.

ద్రవ్యోల్బణం అంటే మార్కెట్లో వస్తువుల ధరలపై ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే... దానర్థం ధరలు కూడా ప్రభుత్వం అధీనంలో ఉన్నట్లే లెక్క. ఇది వినియోగదారులకు శుభవార్తే అయినప్పటికీ ఖర్చుల విషయంలో మాత్రం ప్రభుత్వానికి చేదు వార్తే. ఆహార పదార్థాలపై ధరలు ప్రభావం ఎక్కువగా ఉందంటే... వాటిని తగ్గించి ప్రజలకు అదించాలి. ఈ క్రమంలో ప్రభుత్వమే అదనంగా భరించాల్సి ఉంటుంది. అంటే రైతులకు కొన్ని పంటలకు పరిహారం చెల్లిస్తుంది. కనీస మద్దతు ధర విధానంలో భాగంగానే ఇదంతా ప్రభుత్వం చేస్తుంది. 2022కల్లా వ్యవసాయ రంగంలో లాభాలు రెట్టింపు కావాలనే లక్ష్యంతో మోడీ సర్కార్ పనిచేస్తోంది.

ఇక బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు పక్కన బెడితే ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే వినియోగదారులకు చాలా మంచింది. వరి, పాలు, నూనె విత్తనాల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే... ధాన్యాలు,గోదుమలు, ఆలుగడ్డలు వరుసగా 5.54శాతం, 8.87 శాతం,80.13 శాతంగా పెరిగాయి. ఉల్లి, గుడ్లు, మాంసం హోల్‌సేల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం తగ్గుతూ కనిపించింది. అంతేకాదు ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉండదని చాలామంది భావించారు. ముడిచమురు ధరల్లో పెరుగుదల కనిపించిందంటే ద్రవ్యోల్బణం నియంత్రణ కోల్పోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉంది.

2014 సాధారణ ఎన్నికలకు ముందు ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతూ రెండంకెలకు చేరుకుంది. యూపీఏ-2 సమయంలో ఆహార ధరలు పెరిగిపోతుండటంతో ద్రవ్యోల్భణం కూడా నియంత్రణ కోల్పోయింది. 2014 తర్వాత ఇది పూర్తి భిన్నంగా తయారైంది. మోనిటరీ విధానాల అంచనాలను హోల్‌సేల్ టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేది. ఇప్పుడు వినియోగదారుడి ధరల ద్రవ్యోల్బణం ఆధారంగా విధానాలను అంచనా వేస్తోంది రిజర్వ్ బ్యాంక్.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications