సినిమా చూసి నకిలీ అవతారమెత్తి లూటీ

ముంబై: టీవీలో వచ్చిన సినిమా చూసి నకిలి ఇన్ కం ట్యాక్స్ అధికారుల అవతారం ఎత్తారు. సోదాల పేరుతో చక్కగా నటించారు. చేతికి చిక్కిన నగదు, నగలు, విలువైన వస్తువులు లూటీ చేసి ఇప్పుడు కటకటాలపాలైన సంఘటన ముంబై నగరంలో జరిగింది.

ముంబై నగరంలోని ధవాని ప్రాంతంలో నివాసం ఉంటున్న, జగదీష్ (30), పరేష్ గోస్వామీ (35), భరత్ వెగ్డా (30), ఖాదర్ షేక్ (32), పంకజ్ చావన్ (34), ఫిరోజ్ షేక్ (30), బాలక్రిష్ణ (35), యూనీస్ షేక్ (32) అనే నిందితులను అరెస్టు చేశామని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్పారు.

అరెస్టు అయిన వీరందరూ స్నేహితులు. గత నెల 26వ తేదిన టీవీలో వీరు ఒక సినిమా చూశారు. అందులో నకిలి ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఎలా నిలువు దోపిడీలు చేస్తున్నారు అని తెలుసుకున్నారు. మనం అలాగే చేస్తే సరిపోతుందని, ఎవ్వరికి అనుమానం రాదని ప్లాన్ వేశారు.

Inspired by Movie: Fake Incom Tax officers arrested in Mumbai

ఆ సందర్బంలో జగదీష్ ఒక అడుగు ముందుకు వేసి చక్కటి సలహ ఇచ్చాడు. మా మామ రాంజీ బాయ్ ముంబై నగరంలో పెద్ద బిల్డర్ అని అన్నారు. అతని దగ్గర నగదు, నగలు చాల ఉన్నాయని, ఐటి అధికారులకు భయపడి అతని స్నేహితుడు జయంతి బాయ్ దగ్గర దాచి పెట్టాడని సమాచారం ఇచ్చాడు.

అంతే రాంజీ బాయ్ ఇంటిలో సోదాలు చెయ్యడానికి సిద్దం అయ్యారు. జూన్ 2వ తేది ఉదయం 7.30 గంటల సమయంలో రెండు కార్లలో అందరూ రాంజీ బాయ్ ఇంటి దగ్గరకు వెళ్లారు. నకిలి ఐడి కార్డులు చూపించి తాము ఇన్ కం ట్యాక్స్ అధికారులు అని చెప్పారు.

ఇంటిలో సోదాలు చేశారు. రాంజీ బాయ్ కు అనుమానం రాకుండ జాగ్రతలు తీసుకున్నారు. ఆ సమయంలో జగదీష్ వీది చివరిలో ఉన్నాడు. రాంజీ బాయ్ భయపడి రూ. 1.65 కోట్ల విలువైన బంగారు నగలు, విలువైన వస్తువులు, నగదు, వాచ్ లు వారికి అప్పగించాడు.

తరువాత రాంజీ బాయ్ లబోదిబో అంటు స్నేహితుల దగ్గర విషయం చెప్పాడు. ఈ విషయం పోలీసుల చెవిలో పడింది. గుట్టు చప్పుడు కాకుండ దర్యాప్తు చేశారు. అసలు సూత్రదారి రాంజీ బాయ్ అల్లుడు జగదీష్ అని తెలుసుకుని అతనిని పట్టుకుని నాలుగు తగిలిస్తే అసలు విషయం వెలుగు చూసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+