మే 23.. కౌంటింగ్ డే టార్గెట్.. భారీ ఉగ్రదాడికి స్కెచ్
ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఆరు దశల పోలింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏడవ విడత మాత్రమే మిగిలింది. ఇక మే 23వ తేదీన ఫలితాలు రానున్నాయి. కేంద్రంలో అధికారంలోకి ఎవరు రానున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు భారీ ఉగ్రదాడికి స్కెచ్ వేసినట్లు బయటపడటం భయాందోళన రేకెత్తిస్తోంది.
మే 23వ తేదీ టార్గెట్‌గా అదను చూసి ఉగ్రదాడితో విరుచుకుపడాలని టెర్రరిస్టులు భారీ స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. గురువారం షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. అందులో ఒకడి జేబులో నుంచి ఉగ్రదాడికి సంబంధించిన మ్యాప్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి.

అవంతిపురా, శ్రీనగర్ ఎయిర్ బేస్ క్యాంపులపై దాడి జరిపేలా ఆ స్కెచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్ట్ సంస్థలు ఈ దాడులకు ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఈ రెండు క్యాంపులే టార్గెట్‌గా కౌంటింగ్ రోజు బీభత్సం సృష్టించాలనేది వారి ప్లాన్‌గా అర్థమవుతోంది.
మే 23 కౌంటింగ్ రోజుకు సరిగ్గా రంజాన్ మాసంలో 17వ రోజు రానుంది. ఆ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకుని కలకలం సృష్టించాలనేది వారి స్కెచ్ గా అనుమానిస్తున్నాయి భద్రతా దళాలు. దీనికోసం ఈనెల 14వ తేదీన పుల్వామా ప్రాంతంలో ఉగ్ర కమాండర్ల భేటీలో ఈ దాడులకు సంబంధించిన ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications