అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ .. దీదీ మమతా బెనర్జీ ఫుల్ హ్యాపీ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి అధికారులు అరెస్టు చేసి హార్ జైలుకు పంపించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ లభించింది. మార్చి 21న ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచి జైలుకు తరలించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు
అప్పటినుంచి అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో బెయిల్ కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఒక దశలో ఆయన బెయిల్ పై బయటకు రావటం కోసం మామిడి పండ్లు తింటున్నారు అన్నది కూడా కోర్టులో వాదనకు కారణమైంది. ఆయన డైట్ పైన కూడా చర్చ జరిగింది. ఇక నేడు అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసి బిగ్ రిలీఫ్ ఇవ్వడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించారు.

కేజ్రీవాల్ కు బెయిల్ .. దీదీ సంతోషం
మతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడంపై ఇండియా కూటమి నేతలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేయడాన్ని వారు స్వాగతిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.
ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ బయటకు రావటం ఉపయోగం
ప్రస్తుత లోక్సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వడం తమకు ఉపకరిస్తుందని మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంలో తను చాలా సంతోషంగా ఉన్నానని, అరవింద్ కేజ్రీవాల్ బయటకు రావడం ఎన్నికల సమయంలో ఉపయుక్తమని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ పై బయటకు రానున్న అరవింద్ కేజ్రివాల్ కు కోర్టు జూన్ 1వ తేదీ వరకు మాత్రమే వర్తించనుంది.
కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్
అప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలోనూ, పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొనవచ్చని పేర్కొంది. అయితే సీఎం హోదాలో ఎటువంటి ఫైళ్ళ మీద అధికార హోదాలో సంతకాలు చేయకూడదని, సుప్రీంకోర్టు షరతు విధించింది. ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమీక్షలు కూడా చేయకూడదని ఆదేశించింది. సీఎంగా ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించిన రాదని తెలిపింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications