International women's day: మహిళలకు మీరివ్వాల్సిన నిజమైన గౌరవం ఇదే!
ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకోవడం ఈ సందర్భంగా మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తు చేసుకోవడం, లింగ సమానత్వం కోసం వేస్తున్న అడుగులను తెలియజేయడం, తద్వారా మహిళలలో స్ఫూర్తిని నింపడం ప్రతి ఏడాది జరిగేదే.
లింగ సమానత్వం ఏ దేశంలో సాధ్యమైంది?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలు సాధిస్తున్న ప్రగతిని సెలబ్రేట్ చేసుకోవడానికి, మహిళా లోకానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకునే అవగాహన పెంచుకోవడానికి జరుపుకునే ఒక పండుగ రోజు.ప్రపంచం అపూర్వమైన పురోగతిని సాధిస్తున్న వేళ కూడా ఇప్పటివరకు ఏ దేశంలోనూ లింగ సమానత్వాన్ని సాధించలేని పరిస్థితి ఉంది. ఆకాశంలో సగం, అవనిలో సగం అని మహిళల గురించి చెప్పుకుంటున్నా అవి మాటలకే పరిమితం అవుతున్నాయి.

ఇంకా ఉద్యోగాలు చేసే చోట మహిళలపై వివక్ష
అనేక రంగాలలో మహిళలు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళల విషయానికే వస్తే గతంతో పోలిస్తే ఉద్యోగాలలో మహిళలపై వివక్ష కొంతవరకు తగ్గినట్టు అనిపించినా వేతన వ్యత్యాసాలు, సామాజిక అడ్డంకులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అనేక నివేదికల అంచనా ప్రకారం ఐటీ సహా పలు రంగాలలో పురుషులతో పోలిస్తే మహిళలకు 20% జీతాలు తక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
పనిచేసే చోట తక్కువ జీతాలు, వసతుల లేమి
తక్కువ జీతాలతో, ఎక్కువ పని భారంతో మహిళలు ఇప్పటికీ అనేకమంది ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మొత్తం 45 శాతం మంది మహిళా ఉద్యోగులు తక్కువ జీతం సమస్యలు ఎదుర్కొంటున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అంతేకాదు పనిచేసే చోట పురుషాధిక్య ప్రభావంతో వివక్షకు గురవుతున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేసే మహిళలకు ఇప్పటికీ ఆయా సంస్థలు పూర్తిస్థాయి వసతులు, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల నిజమైన విజయం అప్పుడే
ఆడ, మగ అన్న వ్యత్యాసం పోయి, పనిచేసే చోట కూడా మహిళలు గుర్తించబడిన రోజు, జీతంలో వ్యత్యాసాలు లేకుండా పురుషులతో సమానమైన వేతనాలను మహిళలు అందుకున్న రోజు నిజంగా పని స్థలాలలో మహిళలు విజయం సాధించినట్టు అన్న అభిప్రాయాన్ని పలువురు మహిళలు వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు మీరివ్వాల్సిన గౌరవం ఇదే
మహిళా దినోత్సవం రోజు మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ, మహిళల గొప్పతనాన్ని కీర్తిస్తూ స్టేటస్ లు పెట్టుకునే పురుష పుంగవులు సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చి, వారి పురోగతిని అడ్డుకోకుండా వారిని ఎదగనివ్వడం చేస్తే అదే నిజమైన గౌరవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications