International Women's Day: మహిళా దినోత్సవం జరుపుకోవాల్సింది ఇందుకే... ఈ సంవత్సరం థీమ్ ఇదే!!
మగువ.. సృష్టికి మూలం. అవనిలో సగం.. ఆకాశంలో సగం.. కానీ అవకాశాలలో మగవాళ్ళతో పోటీ పడుతున్నా కొన్ని రంగాలలో కాస్త వివక్షకు గురవుతున్నప్పటికీ దూసుకుపోతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. మహిళల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా, మహిళా సాధికారతకు పట్టం కట్టేలా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం.

మహిళల్లో స్ఫూర్తి నింపే సరికొత్త థీమ్ తో మహిళా దినోత్సవం
తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా, కష్టాల సమయంలో ఆత్మీయ నేస్తంగా, ఉద్యోగ, వ్యాపారాలలో తమకు తామే సాటిగా దూసుకుపోతున్న మహిళ యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. అటువంటి మహిళల గొప్పతనాన్ని చెప్పుకోవటానికి మహిళా దినోత్సవం ఒక వేదిక అని చెప్పొచ్చు. కార్మిక ఉద్యమం నుండి పుట్టిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మహిళలకు సంబంధించిన ఒక కొత్త అంశాన్ని ప్రపంచానికి తెలియ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మహిళలకు పట్టం కట్టే ఒక సరికొత్త థీమ్ తో ప్రతి సంవత్సరం మహిళల గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తుంది.

మహిళా దినోత్సవం ఈ ప్రయత్నంలో భాగమే
దాదాపు శతాబ్ద కాలానికి ముందు నుండే ప్రపంచవ్యాప్తంగా మహిళలందరి కోసం ప్రత్యేకమైన రోజుగా మార్చి ఎనిమిదవ తేదీని గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల సమస్యల పైన, మహిళా సాధికారతపైన దృష్టిసారించేలా, మహిళలు అనేక రంగాలలో ఆర్థిక స్వావలంబన సాధించేలా జరుగుతున్న ప్రయత్నానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఊతమిస్తుంది.

మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించాలి: థీమ్ ఇదే
గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వివక్షను బద్దలు కొట్టి లింగసమానత్వాన్ని పెంపొందించండి అనే థీమ్ తో నిర్వహిస్తే, ఈ సంవత్సరం లింగ సమానత్వం మాత్రమే కాదు ప్రతి చోట మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడాన్ని ప్రచార థీమ్ గా నిర్ణయించారు. స్థిరమైన రేపటి కోసం, మహిళా సాధికారత కోసం చేయాల్సిన ఎన్నో పనులను దిశనిర్దేశం చేస్తున్న ఐక్యరాజ్యసమితి, ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లింగ సమానత్వంపై దృష్టి సమాజం యొక్క డిఎన్ఏ లో భాగం కావాలని ఈసారి మహిళలకు సమాన అవకాశాలు ఎందుకు లేవు? మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించాలి అనే థీమ్ తో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఇదే..
అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే.. మహిళల్లో నిబిడీకృతమై ఉన్న శక్తిని బయటకు తీయడమే కాకుండా, మహిళా చైతన్యాన్ని, మహిళలు సాధించిన విజయాలను, పదిమందికి తెలియచేసి, వారిలో స్ఫూర్తి నింపి ముందుకు నడిపించడం అని చెప్పుకోవడం తప్పేమీ కాదు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళలు సాధించిన ఎన్నో విజయాలు, వారి గొప్పతనాన్ని మహిళా దినోత్సవం వేదికగా చెప్పడం వల్ల అది ప్రతి ఒక్కరిలో కావలసిన ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో వారు సాధించాల్సిన అనేక విషయాలపై మహిళా దినోత్సవం చేస్తుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications