International Women's Day 2024: దేశ ఆర్ధికప్రగతికి మహిళల ముందడుగే కీలకం.. థీమ్ ఇదే!!

సృష్టికి మూలం మగువ. ఆకాశంలో సగం, అవనిలో సగం మహిళ.. కాస్త ప్రోత్సహిస్తే అవకాశాలలోనూ సగం.. అంతకు మించి అని నిరూపించే స్థితికి వచ్చింది నేటి మహిళ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ధిక రంగంలో మహిళల పురోగతికి వెయ్యాల్సిన ముందడుగు గురించి వన్ ఇండియా ప్రత్యేక కథనం.

దేశ ప్రగతి మహిళా సాధికారత మీద ఆధారపడి ఉంది.. మహిళా సాధికారత లేకుండా దేశ శ్రేయస్సును ఊహించలేం అంటే అతిశయోక్తి కాదు. మహిళా సాధికారత సాధించడానికి, ఆర్థికంగా మహిళలు బలోపేతం కావడానికి, దేశ ఆర్థిక రంగంలో మహిళలు కీలక భూమిక పోషించడానికి విధానాలలో మార్పులతో పాటు సామాజిక చైతన్యం, కుటుంబ ప్రోత్సాహం ఎంతో అవసరం.

International Women s Day 2024 Women leadership is the key to economic progress this is the theme

ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారని ఆర్థిక సర్వే వెల్లడించింది. పురుషుల కంటే ఎక్కువగా ఉన్న మహిళలు దేశ జీడీపీలో అంతే కీలకంగా ఉన్నారా అంటే... కచ్చితంగా లేదు అనే చెప్పాలి.

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 9 శాతంగా ఉన్న మహిళా అక్షరాస్యత, ప్రస్తుతం 77 శాతానికి చేరుకుంది. భారతదేశ జిడిపిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచవలసిన అవసరం ఉంది. 77 శాతం మహిళలు చదువుకుంటున్నప్పటికీ ఇంకా చదువుకున్న ఆడపిల్లలు చాలామంది ఇంకా సాంప్రదాయాలు, కట్టుబాట్లు గోడల మధ్య ఉండి ఉగాది ఉపాధి కోసం గడప దాటుతున్న పరిస్థితి లేదు.

ఇందుకు కారణం పనిచేసే చోట మహిళలకు ఉన్న ఇబ్బందులు. పని వాతావరణంలో సమస్యలు, వేతనాలలో పురుషులకు ఒక విధంగా, మహిళలకు ఒక విధంగా ఇవ్వడం వంటి వ్యత్యాసాల కారణంగా, అంతేకాకుండా కొన్ని సందర్భాలలో లైంగిక వేధింపుల కారణంగా మహిళలు ఉపాధి దిశగా, ఆర్థిక సాధికారత దిశగా బలంగా అడుగులు వేయలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఆర్థిక రంగంలో మహిళలను ముందుకు తీసుకుని వెళ్ళే దిశగా థీమ్ ను నిర్ధారించడం జరిగింది. పురోగతి వేగవంతం కావాలంటే మహిళా సామర్థ్యాన్ని పెట్టుబడిగా పెట్టాలని, ఇది మహిళా సాధికారతను సాధించడానికి ఉపయోగపడుతుందని నిర్ణయించడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+