భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!
యుద్దం ప్రభావం పెట్రో ధరల పైన భారీగా పడుతోంది. ఇప్పటికే వంట గ్యాస్ కొరత కారణంగా హోటల్ రంగం కుదేలైంది. ఇంటికి వినియోగించే వినియోగదారుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలను భారీగా పెంచారు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పటం లేదు. పవర్ పెట్రో పైన రూ 2 వరకు పెంచిన ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు ఇండస్ట్రియల్ డీజిల్ పైన ఏకంగా రూ 22 వరకు పెంచేసారు. దీని ప్రభావం నిత్యావసరాల పైన పడటం ఖాయంగా కనిపిస్తోంది. యుద్దం మరింత కాలం కొనసాగితే.. కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమాసియా యుద్ద ప్రభావం గ్యాస్, పెట్రో ఉత్పత్తుల పైన పడుతోంది. తాజాగా పవర్ పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచినట్లు HPCL ప్రకటించింది. సవరించిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే సాధారణ పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలపై ఇప్పటికే ప్రజల్లో ఆందోళన కొనసాగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల మార్పుల ను బట్టి మరిన్ని ధరల సవరణలు జరిగే అవకాశముంది. ఇదే సమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పారిశ్రామిక డీజిల్ ధరను లీటరుకు రూ.87.67 నుంచి రూ.109.59కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పారిశ్రామిక రంగం, లాజిస్టిక్స్, రవాణా ఖర్చులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

నిత్యావసర వస్తువుల ధరల పై ప్రభావం
ఈ నిర్ణయంతో అన్నింటి పైన రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వంట గ్యాస్ ధరలను భారీ పెంచారు. ఇప్పటికీ కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేక పలు ప్రాంతాల్లో హోటళ్లను మూసి వేసారు. కాగా.. పారిశ్రామిక డీజిల్‌ను సాధారణ పెట్రోల్ పంపులలో అమ్మరు. దీనిని ఫ్యాక్టరీలు, పెద్ద జనరేటర్లు, మైనింగ్ కంపెనీలు, నిర్మాణ స్థలాలు, పవర్ ప్లాంట్లు నేరుగా కొనుగోలు చేస్తాయి. ముడి చమురు ధరలలో ఈ పెరుగుదల సామాన్య ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది. సామాన్య ప్రజలు వినియోగించే పెట్రోలు- డీజిల్ ధరల పైన ఇప్పటి దాకా పెంపు నిర్ణయం జరగలేదు. యుద్దం మరింత కాలం కొనసాగితే.. వీటి ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందనే అందోళన వ్యక్తం అవుతోంది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications