ఇంత ఖాళీగా ఉన్నారేంట్రా: iphone 17 కోసం కొట్టుకున్నారు.. తోసుకున్నారు

కొత్త ఐఫోన్ 17 సిరీస్ విడుదల సందర్భంగా ముంబై బాంద్రా- కుర్లా కాంప్లెక్స్ లో గల జియో సెంటర్ వద్ద గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ ఫోన్ ను కొనుగోలు చేయడానికి రాత్రి నుంచి క్యూలైన్ లో నిల్చుకున్నారు యువకులు. కొన్ని గంటల పాటు అక్కడే పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు సైతం చెలరేగాయి. ఒకరినొకరు తోసుకున్నారు.. తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

భారత్ లో నేటి నుంచి ఐఫోన్ 17 సిరిస్ అమ్మకాలు ఆరంభం అయ్యాయి. ముంబై, బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై, కోల్ కత.. వంటి ప్రధాన నగరాల్లో యాపిల్ ఐఫోన్ స్టోర్స్ కూడా ఇదివరకే ఓపెన్ అయ్యాయి. ముంబైలో యాపిల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఏర్పాటైంది. దీని వద్ద రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో క్యూలో నిల్చున్నారు కొనుగోలుదారులు. వారిలో 80 శాతం మందికి పైగా యువకులే ఉండటం గమనార్హం. ఐఫోన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

iPhone 17 Frenzy Punches and Brawls Outside Mumbai Store

కాగా- స్టోర్ తెరిచే సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్యూ మరింత పెరిగింది. దాదాపు కిలోమీటర్ దూరం వరకు కొనుగోలుదారులు క్యూలో నిల్చున్నారు. క్యూలైన్ మధ్యలో రావడానికి కొందరు యువకులు ప్రయత్నించడం.. గొడవకు దారి తీసింది. రాత్రి నుంచి అక్కడే పడిగాపులు పడుతున్న కొనుగోలుదారులు వారిపై దాడికి దిగారు. ఈ క్రమంలో వారి మధ్య కొట్లాట జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.

భారీగా క్యూలైన్ ఉండటం, ఘర్షణలు చోటు చేసుకోవడం వల్ల కొద్దిసేపు ఐఫోన్ అమ్మకాలు నిలిచిపోయాయి. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో గొడవ చల్లారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులోని వేలాది మంది కస్టమర్లు కొత్తగా విడుదలైన ఫోన్‌లను కొనడానికి ఎగబడ్డారు. ఐఫోన్ 17 సిరీస్ ధరలు 82,900 నుండి 2,29,900 రూపాయల వరకు ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్నవారు, నేరుగా వచ్చిన కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేశారు.

ముంబైలో మొదటి కస్టమర్‌లలో ఒకరైన అమన్.. ఒకేసారి మూడు ఐఫోన్లను కొన్నాడు. ఇంట్లో వాళ్లందరికీ ఈ ఫోన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి నుంచి బీకేసీ సెంటర్ వద్ద క్యూలైన్ లో నిల్చున్నానని చెప్పాడు. ఈ ఫోన్ కోసం ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. ఢిల్లీ, బెంగళూరులలోనూ ఇదే విధమైన డిమాండ్ కనిపించింది. అక్కడ కూడా ప్రజలు ఈ ఫోన్ కొనడానికి గంటల తరబడి వేచి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+