ఐఫోన్ 17సిరీస్ తయారీ భారతదేశంలోనే: ట్రంప్ కు షాకిచ్చిన యాపిల్ సిఈవో టిమ్ కుక్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తూ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు భారతీయులను షాక్ కు గురి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్లో యాపిల్ కంపెనీలు పెట్టవలసిన అవసరం లేదని, భారత్ లో ఐఫోన్లు తయారు చేస్తున్నందుకు యాపిల్ సంస్థపైన ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

ఇండియాలో యాపిల్ కంపెనీలు పెట్టొద్దని ట్రంప్ వ్యాఖ్యలు
దోహాలో డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ ని సూచిస్తూ భారత్ తన ప్రయోజనాలను తానే చూసుకోవాలని భారత్ అమెరికా వస్తువులపై టారిఫ్ వసూలు చేయబోమని చెప్పిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కంపెనీలు పెట్టడం తనకు నచ్చడం లేదని మీరు భారత్ కు సహాయం చేయాలనుకుంటే ఓకే అన్నారు.

iPhone 17 series to be manufactured in India Apple CEO Tim Cook shocks Trump

Take a Poll

స్పందించిన టిమ్ కుక్.. ట్రంప్ కు షాక్
ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్ లు వసూలు చేసే దేశాలలో ఒకటని అక్కడ అమ్మకం చాలా కష్టంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో దీనిపైన దుమారం కొనసాగుతున్న వేళ యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైన తాజాగా టిమ్ కుక్ స్పందించారు. ట్రంప్ కు ఊహించని షాక్ ఇచ్చారు.

ఐఫోన్ 17 సిరీస్ తయారీ భారతదేశంలోనే
యాపిల్ భారత్ ను వదిలి వెళ్ళడం లేదని, యాపిల్ కంపెనీలు భారత్లో ఉత్పత్తులను కొనసాగిస్తాయి అని టిమ్ కుక్ వెల్లడించారు. త్వరలోనే ఐఫోన్లు తయారీని మరింత పెంచుతామని ఆయన ప్రకటన చేశారు. ఐఫోన్ 17 సిరీస్ తయారీ భారతదేశంలోనే ఉండబోతుందని టింకు తెలిపారు iphone pro మోడల్ ను కూడా తయారు చేస్తామని టాటా ఎలక్ట్రానిక్స్ ముందుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు
ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ తయారీని ఫాక్స్ కాన్ మొదలు పెట్టిందని టిమ్ కుక్ తెలిపారు. ఇక మరోవైపు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు భారత్లో యాపిల్ కంపెనీల పెట్టుబడుల పైన కీలక వ్యాఖ్యలు చేశాయి. భారత్ నోటి నుంచి ఆపిల్ పండు లాక్కోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్న క్రమంలో, దీనిపైన క్లారిటీ ఇచ్చాయి.

భారత్లో ఐఫోన్లను ఉత్పత్తి చేయడానికి భారీ తయారీ కేంద్రం
కేంద్ర ప్రభుత్వ వర్గాలు భారతదేశంలో యాపిల్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నాయి. భారత్లో ఐఫోన్లను ఉత్పత్తి చేయడానికి భారీ తయారీ కేంద్రం అవసరం పడుతుందని యాపిల్ తమను కోరినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+