IPL 2023 : రింకూ సింగ్ కు ధోనీ సలహా ఇదే- MSD వరల్డ్ బెస్ట్ ఫినిషర్ అంటూ ప్రశంసలు..
ఐపీఎల్ 2023 లీగ్ దశ పూర్తి కావస్తోంది. త్వరలో ప్లే ఆఫ్ మ్యాచ్ లు మొదలు కాబోతున్నాయి. ప్లే ఆఫ్ లోకి వెళ్లేందుకు గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నాయి. మరో రెండు స్దానాల కోసం నాలుగు నుంచి ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ అర్హత కోసం మిగిలిన లీగ్ దశలో ప్రతీ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ఆటగాళ్ల మెరుపులు, ఫినిషింగ్స్ వారిని ప్రత్యేకంగా మార్చేస్తున్నాయి.
ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటికే ముగిసిన మ్యాచ్ ల్లో దూకుడైన బ్యాటింగ్ తో ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ముఖ్యంగా వన్డేలు, టీ20ల్లో బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర కింగ్ ధోనీ తరహాలోనే మ్యాచ్ ల్ని రింకూ ముగిస్తున్నాడు. దీంతో రింకూ సింగ్ ను కూడా ఓ దశలో ధోనీతో అభిమానులు పోలుస్తున్నారు. ఇదే క్రమంలో రింకూ సింగ్ ను తాజాగా కలిసిన ధోనీ.. ఈ యువ బ్యాట్స్ మెన్ కు ఓ సలహా ఇచ్చాడు.

మహేంద్ర సింగ్ ధోనీ తనకు ఇచ్చిన సలహాను రింకూ సింగ్ బయటపెట్టాడు. చాలా సింపుల్‌గా ఉండాలని, అతిగా ఆలోచించవద్దని ధోనీ తనకు సలహా ఇచ్చాడని రింకూ వెల్లడించాడు.ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ అని రింకూ ఆకాశానికెత్తేశాడు. తాను బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు ఇంకా ఏమి చేయగలనంటూ ధోనీని రింకూ అడిగాడు. దీంతో పెద్దగా ఆలోచించవద్దని, బంతి కోసం వేచి ఉండి దాని ప్రకారం ఆడమని ధోనీ సలహా ఇచ్చినట్లు రింకూ చెప్పాడని ఇండియా టుడే పేర్కొంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో 11 మ్యాచ్‌లలో 337 పరుగులు చేసిన కేకేఆర్ స్టార్ బ్యాట్స్ మెన్ రింకూ సింగ్ .. రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన రాజస్తాన్ రాయల్స్‌తో ఇవాళ జరిగే మ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం రింకూ 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబడుతున్నాడు. ఈ సీజన్‌లో తన సహచరుడు ఆండ్రీ రస్సెల్ ను సైతం అధిగమించాడు. అంతే కాదు ఇప్పుడు కోల్ కతా జట్టుకు బెస్ట్ ఫినిషర్ గా కూడా మారిపోయాడు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications