ఖరీదైన టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC's most costly tour package: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. ఓ ఖరీదైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీని గరిష్ట ధర 1,72,230 రూపాయలు, కనిష్ట ధర.. 1,15,060 రూపాయలు. పిల్లలకు కూడా అదే స్థాయిలో టూర్ ఛార్జీని ఖరారు చేసింది ఐఆర్‌సీటీసీ

టూర్ ప్యాకేజీ ఏంటీ..?

ఈ ప్యాకేజీ పేరు- భారత్ భూటాన్ మిస్టక్ మౌంటెయిన్ టూర్. గువాహటి, షిల్లాంగ్, చిరపుంజి, భూటాన్ వంటి ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలు ఈ ప్యాకేజీలో చేర్చింది. లగ్జూరియస్ ఏసీ రైలు ద్వారా ఆయా పర్యాటక కేంద్రాలను దర్శించుకోవచ్చు. 13 రాత్రులు/ 14 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది.

IRCTC announced Bharat Bhutan Mystic Mountain tour package

జర్నీ ఎప్పుడు? ఎక్కడి నుంచి?

జూన్ 28వ తేదీన ఢిల్లీ సఫ్దర్ జంగ్ నుంచి ఈ రైలు ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 150 సీట్లు మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- సుపీరియర్ ఏసీ 1 (కపుల్)- 20, సుపీరియర్ ఏసీ (1 క్యాబిన్)- 38, డీలక్స్ ఏసీ 2టయర్- 36, కంఫర్ట్ ఏసీ 3టయర్- 56 సీట్లు.

ఫుడ్ ఎలా?

సఫ్దర్ జంగ్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్, అలీగఢ్, తుండ్లా జంక్షన్, కాన్పూర్, లక్నో, వారణాశిల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు. ఇందులో ఉండే ట్రైన్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ అందిస్తారు.

ఏమేం చూడొచ్చు..

ఈ ప్యాకేజీలో గువాహటిలో- ప్రఖ్యాత కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అలాగే బ్రహ్మపుత్ర నదిలో విహరించే సౌకర్యం ఉంది. చిరపుంజిలో- సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్, మౌసామాయ్ గుహలు, నొఖాలిఖాయ్ వాటర్ ఫాల్స్, ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ ను చూడొచ్చు. షిల్లాంగ్ లో- క్యాథడ్రెల్ చర్చి, వార్డ్స్ లేక్, డాన్ బాస్కో మ్యూజియం, ఉమియుం లేక్ లో విహారం చేయవచ్చు.

భూటాన్ లో..?

భూటాన్ రాజధాని థింపు, పునాఖా, పారో.. ఈ టూర్ ప్యాకేజీలో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బుద్ధ పాయింట్ ను సందర్శించవచ్చు. మోతీథంగ్ జులాజికల్ పార్క్, పెయింటింగ్ స్కూల్, నేషనల్ లైబ్రరీ, థింపూ హ్యాండీక్రాఫ్ట్స్ మార్కెట్, తాషీ ఛో జాంగ్..ను చూడొచ్చు.

టైగర్ నెస్ట్..

పునాఖాలో- డోచులా పాస్, పునాఖా జాంగ్ (ప్యాలెస్ ఆఫ్ గ్రేట్ హ్యాపీనెస్) ను సందర్శించవచ్చు. పారోలో- లాంపేరి రాయల్ బొటానికల్ పార్క్, టాంచోంగ్ ఐరన్ బ్రిడ్జి, పారో ప్యాలెస్, టైగర్ నెస్ట్ (టక్సంగ్ మొనాస్టెరీ) బేస్ క్యాంప్ పాయింట్, నేషనల్ మ్యూజియాన్ని చూసే అవకాశం ఉంది. హాట్ స్టోన్ బాత్ సౌకర్యాన్ని కల్పించింది.

ఛార్జీల మాటేంటీ?

ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ సుపీరియర్ ఏసీ 1 (కపుల్) కేటగిరీలో 1,58,850 రూపాయలు. ఇది పూర్తిగా డబుల్ షేరింగ్. సింగిల్ షేరింగ్ గానీ, ట్రిపుల్ షేరింగ్ గానీ, పిల్లలకు గానీ ఇది వర్తించదు.

సింగిల్ షేర్..

ఏసీ 1 (క్యాబిన్)లో- సింగిల్ షేర్ 1,72,230 రూపాయలు. డబుల్ షేర్- 1,44,892, ట్రిపుల్ షేర్- 1,40,990 రూపాయలుగా నిర్ధారించింది ఐఆర్‌సీటీసీ. ఇందులో పిల్లలకు అంటే 5 నుంచి 11 సంవత్సరాల లోపు వారికి చెల్లించాల్సిన ఛార్జీ 1,31,605 రూపాయలు.

పిల్లలకు..

డీలక్స్ ఏసీ 2టయర్ లో సింగిల్ షేర్- రూ. 1,56,230, డబుల్ షేర్- రూ. 1,29,495, ట్రిపుల్ షేర్- రూ.1,16,200, పిల్లలకు- రూ. 1,16,200. కంఫర్ట్ ఏసీ 3టయర్ లో సింగిల్ షేర్- రూ. 1,46,305, డబుల్ షేర్- రూ. 1,18,965, ట్రిపుల్ షేర్- రూ.1,15,060, పిల్లలకు- రూ. 1,08,360లు వసూలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+