IPL 2023 : పంజాబ్.. కింగ్స్ కావాలంటే- ఏం చేయాలో చెప్పిన ఇర్ఫాన్ పఠాన్..మళ్లీ అదే ప్రాబ్లమ్..

పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున మూడు సీజన్లు ఆడిన ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. అప్పటి నుంచీ ఇప్పటివరకూ జట్టు అదే సమస్య ఎదుర్కొంటోందని విశ్లేషించాడు.

పంజాబ్ : 2008లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకూ టైటిల్ సాధనలో విఫలమవుతూనే ఉంది. 2008లో ఐపీఎల్ ఎంట్రీ సీజన్ లో సెమీఫైనల్ వరకూ వెళ్లి ఆశలు రేపిన పంజాబ్ కింగ్స్.. 2014 సీజన్ లో మాత్రం రన్నరప్ గా నిలిచింది. అంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ గ్రూపు స్టేజ్ లోనే పేలవ ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరుస్తోంది. తాజాగా మరో ఐపీఎల్ సీజన్ కు సిద్ధమవుతున్న పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుపై ఆ జట్టు మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు.

పంజాబ్ కింగ్స్ జట్టు ఆరంభం నుంచీ ఇంజిన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించాడు. ముందు నుంచీ పంజాబ్ కింగ్స్ ఇంజన్ సమస్య ఎదుర్కొంటోందని, చాలా సంవత్సరాలుగా వారి ఇంజన్ మారుతూనే ఉందని పఠాన్ గుర్తుచేశాడు. ఇంకా చెప్పాలంటే పంజాబ్ కింగ్ తాము ఆడిన సీజన్ల కంటే ఎక్కువ సార్లు తమ ఇంజన్ మార్పులు చేసిందని పఠాన్ తెలిపాడు. తరచూ మార్పులు చేయడమే జట్టు అసలు సమస్య అని పఠాన్ విశ్లేషించాడు.

irfan pathan points out punjab kings weekness and given valuable suggestions ahead of ipl 2023

అలాగే వచ్చే సీజన్ కోసం తన మాజీ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కొన్ని కీలక సలహాలు కూడా ఇచ్చాడు. వాటిలో ముఖ్యమైనది పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సీమ్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కోవాలని, అలాగే బ్యాక్ స్పిన్ విభాగం కూడా బలంగా ఉండాలని పఠాన్ సూచించాడు. గ్రౌండ్లు ఎలాగో పెద్దవిగా ఉంటాయి కాబట్టి బౌలర్లు ఎంత లెంగ్త్ లో బౌలింగ్ చేయాలనే అంశం చూసుకుంటే ఆ మేరకు తేడా కనిపిస్తుందన్నాడు. ముఖ్యంగా శామ్ కర్రాన్, కగిసో రబడ, అర్ష్ దీప్ సింగ్ వంటి బౌలర్లను సరైన లెంగ్త్ లో బౌల్ చేసేలా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఈసారి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని స్టార్ స్పోర్స్ తో మాట్లాడుతూ పఠాన్ విశ్లేషించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+