నిధులు, అధికారుల్లో వారికే: గుజరాత్‌కే మోడీ పెద్దపీట?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారా? ఎక్కువ నిధులను సొంత రాష్ట్రానికి కేటాయిస్తున్నారా? పాలనలోను గుజరాతీయులకు పెద్ద పీట వేస్తున్నారా? దీనిపై ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది.

మోడీ భారతదేశం మొత్తానికి కాకుండా కేవలం గుజరాత్‌కు ప్రధానిగానే వ్యవహరిస్తున్నారని పేర్కొంది. సాధారణ బడ్జెట్లో, రైల్వే బడ్జెట్‌లో గుజరాత్‌కే ఎక్కువ కేటాయింపులు జరిగాయని, విదేశీ పర్యటనల్లో గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు ఉంటున్నారని పేర్కొంది.

Narendra Modi

మోడీ తాను అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే గుజరాత్‌లో సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138 మీటర్లకు పెంచేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేలా చేశారు. అలాగే తాను ప్రధాని అయ్యాక వచ్చిన తొలి ప్రవాస భారతీయ దివస్‌ను గాంధీనగర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.

అది జరిగిన వెంటనే జనవరిలో నిర్వహించిన వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సుకు పెద్ద ఎత్తున దేశ, విదేశీ ప్రతినిధులు హాజరయ్యేలా చూశారు. మోడీ సమక్షంలో ముఖేష్‌ అంబానీ, ఆదిత్య బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు పోటీలు పడి మరీ గుజరాత్‌లో లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ప్రకటనలు గుప్పించారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో జరగలేదని రాసింది.

ప్రధానిగా మోడీ వెళ్లిన ప్రతి విదేశీ పర్యటనకూ గుజరాత్‌కు చెందిన బడా పారిశ్రామికవేత్తలు వెళ్లి అక్కడి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కేంద్రంలోని ప్రతి కీలక శాఖలోనూ గుజరాత్‌కు చెందిన అధికారులు ఉండేలా చూసుకున్నారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+