భారత్ మరో ముందడుగు.. పీఎస్ఎల్వీసీ-33 సక్సెస్..
సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే క్రమంలో.. ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహ ప్రయోగాలలో చివరిదైన ఏడవ ఉపగ్రహం పీఎస్ఎల్వీసీ-33 ని కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 1,425 కిలోల బరువున్న పీఎస్ఎల్వీసీ-33 ని గురువారం కక్షలోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. నిర్దేశించిన సమయంలోనే ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించడంతో షార్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల పనితీరును ప్రధాని మోడీ అభినందించారు.
ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ నేత్రత్వంలో సాగుతున్న ఈ ప్రయోగం విజయవంతమైతే పూర్తి స్థాయి స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ.. మొబైల్, ట్రావెలింగ్, డేటా సేకరణ,ట్రెక్కింగ్,మ్యాపింగ్,నౌకలు మరియు విమానయానం వంటి రంగాలలో అందుబాటులోకి రానుంది. అలాగే దీని ద్వారా అందుబాటులోకి వచ్చే స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్ సేవల ద్వారా నిర్దేశించిన వ్యక్తులు లేదా వ్యవస్థలకు రహస్యంగా సమాచారాన్ని చేరవేసే అవకాశం ఏర్పడనుంది. దీంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, వాహనాలు ప్రయాణించే మార్గాన్ని గుర్తించడంలోను ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ల సేవలు విరివిగా అందుబాటులోకి రానున్నాయి.

ఈ సేవలు అందుబాటులోకి వస్తే జీపీఎస్ కోసం భారత్ ఇతర దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గతంలో 1999 లో కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాక్ తీవ్రవాదులపై నిఘా కోసం అమెరికాను భారత్ జీపీఎస్ సాంకేతిక సహాయం అందించాలని కోరడం అందుకు అమెరికా ససేమిరా అనడంతో ఎప్పటికైనా సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడమే మేలు అనే ఆలోచనలోకి వచ్చింది భారత్. దానికి అణుగుణంగానే ఇప్పుడు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల ప్రయోగాల్ని విజయవంతంగా పూర్తిచేసింది ఇస్రో.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications