నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45
శ్రీహరికోట : పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ 45 ద్వారా డీఆర్డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటలిజెన్స్ శాటిలైట్.. ఇమిశాట్‌ను నింగిలోకి పంపారు. దీంతో పాటు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 28 నానో ఉపగ్రహాలను వాటి కక్ష్యలో ప్రవేశపెట్టారు.
డీఆర్‌డీవో రూపొందించిన ఇమిశాట్ బరువు 436కిలోలు. తక్కువ ఎత్తు కక్ష్యలో తిరిగే ఈ ఉపగ్రహం రక్షణశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. శత్రు దేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని ఇది సేకరిస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమాచార సేకరణ కోసం భారత్ విమానాలపైనే ఆధారపడుతోంది. ఇకపై అంతరిక్షం నుంచే ఈ పని పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.













Click it and Unblock the Notifications