Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓట్ల లెక్కింపు వేళ..ఉప ముఖ్యమంత్రికి బిగ్ షాక్: రూ1,000 కోట్ల ఆస్తులు అటాచ్

ముంబై: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉంటోన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒకదాని వెంట ఒకటిగా షాకుల మీద షాకులు ఇస్తోన్నారు. మాజీ హోం శాఖ మంత్రిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి పంజా విసిరారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు హైఓల్టేజ్ షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఆస్తులను భారీగా అటాచ్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు. అటాచ్ చేసిన ఈ ఆస్తుల విలువ 1,000 కోట్ల రూపాయలు.

అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో..

అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో..

మనీ లాండరింగ్‌ కేసులో మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్టయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. సుమారు 12 గంటల పాటు విచారించారు. మనీ లాండరింగ్ కేసులో ఇదివరకే ఆయన విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఆయనను న్యాయస్థానం ముందుకు ప్రవేశపెట్టనున్నారు. కస్టడీకి అప్పగించాలని కోరనున్నారు.

 ఉప ముఖ్యమంత్రి ఆస్తులను అటాచ్..

ఉప ముఖ్యమంత్రి ఆస్తులను అటాచ్..


విచారణకు హాజరు కావాలంటూ అనిల్ దేశ్‌ముఖ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే పలుమార్లు సమన్లను జారీ చేశారు. ఆయన దీనికి హాజరు కాలేదు. విచారణకు హాజరు కాలేనందు వల్లే ఆయనను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని అధికారులు వివరించారు. దీనిపై సంకీర్ణ కూటమి నాయకులు ఒకవంక తమ స్పందనను వ్యక్తం చేస్తోన్న సమయంలోనే- ఈ దఫా ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు అటాచ్ చేయడం కలకలం రేపింది. సంకీర్ణ కూటమి నాయకులను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది.

వేర్వేరు ప్రాంతాల్లో..

వేర్వేరు ప్రాంతాల్లో..

బినామీ ప్రాపర్టీల కింద వాటిని అటాచ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. బినామీ పేర్లతో వేర్వేరు రాష్ట్రాల్లో అజిత్ పవార్‌కు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో 20 కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్, ముంబైలో నిర్మల్ హౌస్ ప్రాంతంలో ఉన్న పార్థ్ పవార్ ఆఫీస్‌ను అటాచ్ చేశారు. దీని విలువ 25 కోట్ల రూపాయలు. సతారా జిల్లాలోని జరందేశ్వర్‌లో గల చక్కెర ఫ్యాక్టరీని కూడా అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో చేర్చారు. దీని విలువ 600 కోట్ల రూపాయలు.

90 రోజుల్లోగా..

90 రోజుల్లోగా..

గోవాలో ఉన్న ఓ రిసార్ట్‌‌ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. దీని విలువ 250 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేశారు ఐటీ అధికారులు. వాటతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 27 స్థలాలు కూడా అటాచ్ అయ్యాయి. వాటి విలువ మరో 500 కోట్ల రూపాయలు ఉండొచ్చని చెబుతున్నారు. ఆయా ఆస్తులన్నీ కూడా అజిత్ పవార్ లేదా ఆయన కుటుంబీకులవిగా అనుమానిస్తున్నారు. బినామీ ఆస్తులుగా వాటిని గుర్తించామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆయా ఆస్తులన్నీ కూడా తనవేనంటూ అజిత్ పవార్.. 90 రోజుల్లోగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఆసుపత్రికి అనిల్ దేశ్‌ముఖ్..

ఆసుపత్రికి అనిల్ దేశ్‌ముఖ్..

మరోవంక- మనీలాండరింగ్ కేసు కింద అరెస్టయిన అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ఈడీ అధికారులు విజ్ఞప్తి చేయనున్నారు. అరెస్ట్ చేయడానికి ముందు ఈడీ అధికారులు ఆయన నుంచి స్టేట్‌మెంట్‌‌ను తీసుకున్నారు. వాటిని రికార్డ్ చేశారు. అవే రికార్డులను ఇవ్వాళ న్యాయస్థానానికి సమర్పించే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+