శుభవార్త: టెక్కీలకు 30 లక్షల ఉద్యోగాలు, కానీ, నైపుణ్యం లేకపోతే ఇంటికే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐటీ రంగంలో భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపులంటూ వస్తున్న వార్తలను సాఫ్ట్ వేర్ కంపెనీల అసోసియేషన్ నాస్కామ్ తోసిపుచ్చింది. ఈ ఏడాది నికరంగా 1.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

ప్రపంచవ్యాస్తంగా చోటుచేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో టెక్కీలకు ఉద్యోగాల్లో కోతలను విధిస్తున్నారు..అయితే ప్రధానంగా అమెరికాలో చోటుచేసుకొన్న పరిణామాలు భారత్ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ఎన్నికల సమయంలో ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేర్చాడు. ఈ మేరకు అమెరికాలో ఉంటున్న
స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ట్రంప్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు చెందిన టెక్కీలు ఉద్యోగాలను కోల్పోతున్నారు.

అయితే టెక్కీలు కూడ తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిందేనని నాస్కామ్ అభిప్రాయపడుతోంది. సామర్థ్యాలను పెంచుకోకపోతే నష్టం తప్పదని నాస్కామ్ చెబుతోంది. ప్రతి ఏటా నైపుణ్య పరిశీలన జరిపిన తర్వాతే ఉద్యోగులపై వేటు వేసే ప్రక్రియను చేపట్టనున్నట్టు నాస్కామ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కొత్తగా 30 లక్షల ఉద్యోగాలు

కొత్తగా 30 లక్షల ఉద్యోగాలు


టెక్ స్టార్టప్ లు, ఈ కామర్స్, డిజిటల్ ఇండియా , డిజిటల్ పేమెంట్స్ వంటి కొత్త అవకాశాల నేపథ్యంలో 2025 నాటికి 30 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేస్తున్నట్టు నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ చెప్పారు. ఏటా పనితీరు మదింపు అనంతరం కొంతమంది ఉద్యోగులను తొలగించడం అనేది ఐటీ పరిశ్రమలో సహాజంగా జరిగే ప్రక్రియ.అయితే ఈ ఏడాది కూడ భిన్నంగా ఏమీ ఉండదన్నారాయన.

ఈ ఏడాది 1.5 లక్షల మందికి ఉద్యోగాలు

ఈ ఏడాది 1.5 లక్షల మందికి ఉద్యోగాలు

ఈ ఏడాదిలో నికరంగా 1.5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు నాస్కామ్ ప్రకటించింది.ఐటీరంగంలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులంటూ వస్తున్న వార్తలను నాస్కామ్ తోసిపుచ్చింది. అంతేకాదు కొత్తగా ఈ ఏడాది 1.5 లక్షల మందికి ఉద్యోగాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.2016-17 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో సుమారు 1.7 లక్షలమంది ఉద్యోగాలు పొందారని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ చెప్పారు.

నైపుణ్యాలు పెంచుకోకపోతే అంతే

నైపుణ్యాలు పెంచుకోకపోతే అంతే


సాప్ట్ వేర్ రంగంలో కొనసాగాలంటే టెక్కీలు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిందేనని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. విప్రో, ఇన్పోసిస్, కాగ్నిజెంట్ తదితర కంపెనీల నుండి 50 వేల మందిని తొలగించాలని నిర్ణయం తీసుకొన్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.ఒక్క నాలుగో త్రైమాసికం (2017 జనవరి -మార్చి) లోనే నికరంగా 50 వేల ఉద్యోగులను టాప్ 5 కంపెనీలు నియమించుకొన్నాయని ఆయన గుర్తుచేశారు.

ఉద్యోగులకు శిక్షణ కోసం భారీగా ఖర్చు

ఉద్యోగులకు శిక్షణ కోసం భారీగా ఖర్చు


ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున ఖఱ్చును ఖర్చు చేస్తున్నాయి. ఉద్యోగులకు శిక్షణ, కొత్త టెక్నాలజీపై నైపుణ్యసాధన కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని నాస్కామ్ చైర్మెన్ రామన్ రాయ్ చెప్పారు.పనితీరు ఆధారంగా ఉద్యోగుల్లో మార్పల వల్ల 0.5% నుండి 3% వరకు ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని చంద్రశేఖఱ్ వివరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India’s IT sector continues to be a “net hirer” and added 1.7 lakh jobs in 2016-17, said Nasscom on Thursday responding to fear of layoffs in the industry.The industry association said the fourth quarter of the last financial year saw top five IT majors hiring 50,000 employees. It said that the retrenchment is performance linked and is impacting only 0.5-3% of the total workforce of the IT sector, implying that this year is not different.
Please Wait while comments are loading...