ఎమ్మెల్యే ఎన్నికలు: కాంగ్రెస్ ఎమ్మెల్సీపై ఐటీ పంజా, ఢిల్లీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి షాక్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఇల్లు, కార్యాలయాల్లో గురువారం మద్యాహ్నం ఒక్కసారిగా ఐటీ శాఖ అధికారులు ప్రత్యక్షం అయ్యి సోదాలు చేస్తున్నారు. స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన ఐటీ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు.

కాంగ్రెస్ టార్గెట్

కాంగ్రెస్ టార్గెట్

బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జి. రఘ ఆచార్ నివాసం ఉంటున్నారు. గురువారం మద్యాహ్నం ఆదాయపన్ను శాఖ అధికారులు 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రఘ ఆచార్ ఇంటి ముందు ప్రత్యక్షం అయ్యారు.

కార్యాలయాలు

కార్యాలయాలు

బెంగళూరులోని బెళ్లందూరు సమీపంలోని సెంట్రల్ మాల్ దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రఘ ఆచార్ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు పరిశీలిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని రీతిలో ఐటీ శాఖ అధికారులు మద్యాహ్నం సోదాలు మొదలు పెట్టారు.

కేపీసీసీ అధ్యక్షుడు

కేపీసీసీ అధ్యక్షుడు

కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చాల సన్నిహితుడు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ కు ఎమ్మెల్సీ రఘ వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నారు. చిత్రదుర్గ జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక నుంచి 2013 ఆగస్టు 22న రఘ ఆచార్ ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు.

ఎన్నికల ఎఫెక్ట్

ఎన్నికల ఎఫెక్ట్

కర్ణాటకలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే నెలలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్యసభ, శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆదాయపన్ను శాఖ దాడులు జరగడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Income Tax Department officials on March 8, 2018 conducted surprise raids on residences and office of Legislative Council member and Congress leader G. Raghu Achar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి