అధికారికం: Bangalore ఇక Bengaluru
బెంగళూర్: దేశంలోని ఐటి నగరం బెంగళూర్, కర్ణాటకలోని ఇతర నగరాలు ఇక నుంచి కర్ణాటక పాత పేర్లతో అధికారికంగా చెలామణిలోకి వచ్చాయి. శనివారంనుంచి వాటి పేర్లను మార్చేశారు. Bangalore ఇక Bengaluru అవుతుంది. Mysore ఇక Mysuru అవుతుంది.
కర్ణాటక రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పేర్లు అమలులోకి వచ్చాయి. కర్ణాటకలోని 12 నగరాల పేర్లను మార్చడానికి కేంద్రం హోం మంత్రిత్వ శాఖ అక్టోబర్ 17వ తేదీన పచ్చజెండా ఊపింది. కన్నడ భాష ఉచ్ఛారణకు అనుగుణంగా వాటి పేర్లను మార్చేశారు.

Mangalore శనివారం నుంచి Mangaluru అయింది. బెళ్లారిని బళ్లారిగా పిలుస్తారు. బెల్గాంను బెలగావి అని పిలుస్తారు. హుబ్లీకి హుబ్బళి అనే పేరు అమలులోకి వచ్చింది. తుంకూరు తుమ్మకూరు అవుతుంది. బిజాపూర్‌ను విజపుర అని మార్చారు.
చిక్‌మంగళూర్ ఇక నుంచి చిక్కల్‌మంగళూరు అవుతుంది. గుల్బర్గాను కలబుర్గి అని పిలుస్తారు. హోస్పేట్‌ను సోసపేటేగా మార్చారు. ఈ సందర్భంగా కర్ణాటకకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications