Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాత డ్రెస్సులో ‘నమస్తే ట్రంప్‘కు.. అయినాసరే ఆమెనే స్పెషల్ అట్రాక్షన్..

ప్రతిష్టాత్మక 'నమస్తే ట్రంప్' ఈవెంట్ లో అందరికళ్లూ ఆమెపైనే. ముఖ్యఅతిథులకంటే ముందే మోతేరా స్టేడియంలోకి వచ్చిన ఆమెకు జనం జేజేలు పలికారు. ఐదు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో స్వాగతం పలికారు. వేసుకున్నది పాత డ్రెస్సే అయినప్పటికీ.. ట్రంప్ కూతురు ఇవాంకానే సోమవారం నాటి ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. గత మూడేళ్లలో ఇవాంక ఇండియాకు రావడం ఇది రెండోసారి.

ఆ డ్రెస్ విలువ రూ.1.7లక్షలు..
పాలిటిక్స్ తోపాటు ఫ్యాషన్లను కూడా ఫాలో అయ్యే ఇవాంకను ప్రపంచ మీడియా ఫ్యాషన్ ఐకాన్ గానూ చూస్తుంది. సందర్భానికి తగ్గట్లు ఆమె ధరించే దుస్తులు ప్రతిసారి చర్చనీయాంశమవుతాయి. అయితే సోమవారం నాటి భారత పర్యటనకు మాత్రం ఆమె పాత డ్రెస్ లో రావడం గమనార్హం.

'నమస్తే ట్రంప్' ఈవెంట్ కోసం ఇవాంక ధరించిన తెలుపు, ఎరుపు రంగుల్లోని పూలగౌనును... రెండేళ్ల క్రితం అర్జెంటీనా పర్యటనలోనూ వాడుకున్నారు. దాని ధర రూ.1.7 లక్షలు. అహ్మదాబాద్ లో విమానం ల్యాండైనప్పటి నుంచి ఇవాంక డ్రెస్సుపై చాలా చర్చ జరిగింది.

Ivanka trump gets huge welcome at Motera Stadium, she repeats floral dress

భర్త పక్కనే..
గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్ షిప్ సదస్సు కోసం 2017 నవంబర్ హైదరాబాద్ వచ్చిన ఇవాంక.. అమెరికా వాణిజ్యవేత్తల బృందానికి నాయకత్వ వహించారు. ఆమె.. అమెరికా అధ్యక్షుడికి సలహాదారు కూడ కావడంతో వెళ్లిన ప్రతిచోటా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేది.

Ivanka trump gets huge welcome at Motera Stadium, she repeats floral dress

అయితే తాజా భారత పర్యటనలో మాత్రం ఇవాంక తన టైమ్ మొత్తం ఫ్యామిలీకే కేటాయించనున్నారు. ఫ్లైట్ దిగిన తర్వాత ప్రధాని మోదీ, ఇతర వీవీఐపీలను పలకరించిన ఆమె.. ఈవెంట్ ఆద్యాంతం భర్త జారెడ్ కుష్నర్ పక్కనే ఉండిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+