జయలలితకు భారతరత్న ఇవ్వకూడదు: ఎన్ని కేసులు !

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వకూడదని పీఎంకే యూత్ విభాగం నాయకుడు అన్బుమణి రాందాస్ డిమాండ్ చేస్తున్నారు. జయలలితకు భారతరత్న ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో రాందాస్ ఈ విధంగా చెప్పారు. ఎలాంటి మచ్చలేని సమగ్ర వ్యక్తిత్వం, భారతదేశ అభివృద్దికి నిస్వార్థంగా కృషి చేసిన వారికి అత్యున్నత పురస్కారం (భారతరత్న) ఇవ్వాలని అన్నారు.

J Jayalalithaa doesn’t deserve Bharat Ratna: MP Ramadoss

అయితే భారతరత్న పురస్కారం పొందే అర్హత దివంగత జయలలితకు లేదని, ఆమె మీద 15 అవినీతి కేసులు నమోదు అయ్యాయని, ఆ కేసుల విచారణ ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆమెను నిర్దోషిగా కర్ణాటక హైకోర్టు వదిలేసిన కేసు అప్పీల్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని రాందాస్ గుర్తు చేశారు.

అన్నాడీఎంకేలో అంతా తానై సుప్రీంగా వ్యవహరించిన జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో కొంత రాజకీయ శూన్యం ఏర్పడిందని రాందాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు తమిళనాడులో అధికారంలో ఉండటానికి అన్నాడీఎంకే నాయకులు పార్టీ భాద్యతలు శశికళకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, శశికళకు ప్రజల మద్దతు మాత్రం లేదని అన్బుమణి రాందాస్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+