జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రద్దు: చేతులు కలుపుతున్న ముఫ్తీ, ఒమర్, కాంగ్రెస్, తెరపైకి కొత్త సీఎం
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ సత్యపాలి మాలిక్ బుధవారం అసెంబ్లీని రద్దు చేశారు. కొంతకాలంగా అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ, సజ్జాద్ లొనె నాయకత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్‌లు తమకు ప్రభుత్వ అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాయి.
ముఫ్తీకి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌లు మద్ధతు ఇచ్చాయి. సజ్జద్ లోనెకు బీజేపీ అండగా నిలిచింది. అయితే గవర్నర్ అసెంబ్లీ రద్దుకు మొగ్గు చూపారు. అసెంబ్లీలో ఎక్కువ మంది సభ్యుల మద్ధతు కలిగిన పక్షంగా పీడీపీ ఉంది. దీంతో పాటు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్సు మద్ధతు ప్రకటించడంతో మొత్తం 89 మంది సభ్యులు (ఇద్దరు నామినేటెడ్ సభ్యులు) కలిగిన సభలో తమ బలం 56కు పెరిగిందని, దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌కు పీడీపీ లేఖ రాసింది.
నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ముఫ్తీకి మద్ధతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాత్రం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్సులు ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించలేదని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ రద్దు అనంతరం మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుది.

ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు
పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలి ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముదుకు వచ్చాయి. ముఖ్యమంత్రి రేసులో పీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అల్తాఫ్ బుఖారీ ఉన్నారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలతో కూడిన అలెయన్స్‌ను ఒమర్ అబ్దుల్లా లీడ్ చేయాలని ముఫ్తీ కోరుకుంటున్నారు. కానీ ఒమర్ (నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత) మాత్రం ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలని, కేబినెట్లో చేరవద్దని భావిస్తున్నారు. అయితే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆజాద్ చెప్పడం గమనార్హం.
గవర్నర్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని జమ్ము కాశ్మీర్ బీజేపీ అధ్యక్షులు రవీందర్ రైనా అన్నారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, పీడీపీలు కుట్రలు చేస్తున్నాయని, వారితో రాష్ట్రానికి న్యాయం జరగదని చెప్పారు. ఎన్నికలకు ముందు వారు పొత్తు పెట్టుకొని పోటీ చేయగలరా అని సవాల్ విసిరారు.
గవర్నర్ నిర్ణయపై ముఫ్తీ కోర్టుకు వెళ్లాలని కాగ్రెస్ పార్టీ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ అన్నారు. కేంద్రం సూచనల మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ముఫ్తీకి గవర్నర్ బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిందని చెప్పారు.
Mehbooba Ji should move court as what Governor has done on Centre's instructions is undemocratic & unconstitutional. Mehbooba Mufti wrote to Governor only after Congress & NC supported PDP & Guv should've given her a chance: Prof Saifuddin Soz, Congress, on J&K assembly dissolved pic.twitter.com/4EyP3Pnjdz
— ANI (@ANI) November 21, 2018
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications