కాల్పులకు తెగబడ్డ పాక్: ఇద్దరు జవాన్లు మృతి

Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: భారత జవాన్లు ధీటుగా సమాధానం చెబుతున్నా.. పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా మంగళవారం ఉదయం 5.15గంటలకు సుందర్బని సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం కాల్పులు తెగబడింది.

పాక్ కాల్పులకు ఇద్దరు భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. వినోద్ సింగ్, జాకీ శర్మ అనే మరో ఇద్దరు జవాన్లు కూడా పాక్ సైన్యం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.

J&K: Two jawans killed in ceasefire violation by Pakistan Army in Sunderbani sector

వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, భారత దళాలు అప్రమత్తంగా లేని సమయాన్ని చూసి పాక్ సైనికులు కాల్పులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two jawans have lost their lives on Tuesday in ceasefire violation by Pakistan Army in Sunderbani sector along the Line of Control.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి