వైభవోపేతంగా పూరీ జగన్నాథుడి రథయాత్ర: లక్షలాదిగా పాల్గొన్న భక్తులు

భువనేశ్వర్: ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్ర మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. జగన్నాథుడి రథయాత్రను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. విదేశాల నుంచి కూడా అనేక మంది పూరీకి చేరుకున్నారు. పూరీ రథయాత్ర జరిగే వీధులన్నీ ఇసుకేస్తే రాలనంతా భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్నాథ్ అంటూ భక్తులు పరవశించిపోయారు. పూరీ వీధులన్నీ జగన్నాథుడి నినాదాలతో మార్మోగుతున్నాయి.

రథాలను భక్తులు జగన్నాథుడి నినాదాలతో లాగారు. ఈ ఊరేగింపునకు నందిఘోష్‌ (జగన్నాథుడి రథం), తాళధ్వజ (బలభద్రుడిది), దర్పదళన్‌ (సుభద్ర) రథాలు సిద్ధం చేశారు.కాగా, మంగళవారం ఉదయం జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్టించి తర్వాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహర(బంగారు చీపురుతో ఊడ్చడం) చేశారు.

Jagannath Rath Yatra 2023

ఆ తర్వాత మంగళవారం 3 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. ఈ సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకోనున్నాయి. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు తొమ్మిది రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఆ తర్వాత జూన్ 28న తిరిగి పూరీ మందిరానికి చేరుకుంటారు జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర.


కాగా, రథయాత్ర నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఒడిశా ప్రభుత్వం. భక్తులు వచ్చేందుకు వీలుగా 125 ప్రత్యేక రైళ్లను వేసింది. 180 దళాలతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సారి 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చీఫ్ సెక్రటరీ పీకే జెనా తెలిపారు. ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.

మరోవైపు, జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌.. మరో అద్భుత శిల్పాన్ని పూరీ సముద్రతీరం వెంబడి తీర్చిదిద్దారు. 250 కొబ్బరికాయలతో 6 అడుగుల ఎత్తైన జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడి విగ్రహాలకు ప్రాణం పోశారు. వాటి వెనుక జగన్నాథ రథాలను ఏర్పాటు చేశారు. చరిత్రలో దాసియా బౌరి అనే భక్కుడు.. స్వామి వారికి కొబ్బరికాయలు సమర్పించుకున్న ఘట్టానికి గుర్తుగా శిల్పాన్ని తీర్చిదిద్దినట్లు సుదర్శన్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+